Friday, September 9, 2016

శత్రు దేశాల ఆస్తుల ఆర్డినెన్స్‌ నాలుగోసారి పొడిగింపు


శత్రు దేశాల ఆస్తులకు సంబంధించి 50 ఏళ్ల కిందటి చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం నాలుగోసారి పొడిగించింది. ఈ మేరకు రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ జారీ చేశారు. పాకిస్థాన్‌, చైనాతో యుద్ధానంతరం ఇక్కడి నుంచి ఆ దేశాలకు వలస పోయినవారి ఆస్తులకు ఈ ఆర్డినెన్స్‌ వర్తిస్తుంది. పాకిస్థాన్‌తో యుద్ధం అనంతరం 1968లో ఈ చట్టాన్ని చేశారు. శత్రువుల ఆస్తులు కేంద్ర ప్రభుత్వపరం అవుతాయని, వాటి నిర్వహణకు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆ చట్టం చెబుతోంది. శత్రు దేశాల ఆస్తుల సవరణ బిల్లు 2016 రాజ్యసభలో పెండింగ్లో ఉండటంతో జనవరి 1 నుంచి ఇప్పటివరకు ఆర్డినెన్స్‌తో కాలం నెట్టుకొస్తున్నారు. లోక్‌సభ 2016 మార్చి 9నే బిల్లును ఆమోదించగా, రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీ పరిశీలకు పంపింది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:

Post a Comment