ఐక్యరాజ్యసమితి నూతన చీఫ్ ఎన్నిక కొత్త తరహాలో సాగనుంది. అర్హులైన అభ్యర్థులందరినీ ఇంటర్వ్యూ చేసి కొత్త ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులతో సభ్య దేశాలు భేటీ కావడంతో పాటు వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. 70 సం॥ల ఐక్యరాజ్యసమితి చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టలేదు. దీంతో మహిళలకు సమ ప్రాధన్యాం ఇవ్వాలని నిర్ణయించారు. అర్హతలున్న అభ్యర్థులతో 2016 ఏప్రిల్ 12 నుంచి 14 వరకు వరుస సమావేశాలు నిర్వహించనున్నట్లు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సభ అధ్యక్షుడు మోగెన్స్ లిక్కెటాఫ్ట్ తెలిపారు.
No comments:
Post a Comment