1. మానవుడు ‘నిప్పు’ను ఏ శిలా యుగంలో ఉపయోగించాడు? - ప్రాచీన 2. మానవుడు ఏ యుగంలో జన్మించినట్లు భావిస్తారు? -ప్లిస్టోసిన్ 3. మానవుడు ఏ యుగంలో వేటను ప్రధాన వృత్తిగా చేసుకొని పచ్చి మాంసం తింటూ జీవించాడు? - పాతరాతి 4. ‘దేవదాసి’ ఆనవాళ్లు ఎక్కడ బయట పడ్డాయి? - మొహంజొదారో 5. కింది ఏ ప్రాంతంలో పాతరాతి యుగానికి (పాలియోలిథిక్ ఏజ్) చెందిన ‘వర్ణ చిత్రాలు’ లభించలేదు? - అండమాన్ నికోబార్ 7. జోర్వే (గ్రామీణ) సంస్కృతికి నిదర్శనమైన పట్టణం ఏది? - దైమాబాద్ - ఇనాంగావ్ 10. కుమ్మరి, కమ్మరి, దంత శిల్పులు, నేత పనివారు ఏ సంస్కృతిలో ఉన్నారు? - జోర్వే 11. భారతదేశంలో ‘ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ సంస్థను ప్రారంభించినవారు? - కానింగ్ 12. ‘ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ను పునరుద్ధరించి, దానికి డైరక్టర్ జనరల్ పదవిని కల్పించినవారు? - లార్డ్ కర్జన్ 14. సింధు నాగరికత ఉన్నత స్థితికి చేరిన కాలం? - క్రీ.పూ. 2200-1750 17.''The Sacred Books of the East" గ్రంథాలకు ఎడిటర్‌గా పని చేసినవారు? - మాక్స్‌ముల్లర్ 19. ‘షుగ్గర్’ నది ఒడ్డున సరస్వతి లోయలో బయల్పడిన పట్టణం? 1) రూపార్ 2) బన్వాలీ 3) కాళీభంగన్ 4) దోలవీర సమాధానం: 3 20. ‘బన్వాలీ’ పట్టణానికి సంబంధించని అంశం? 1) గుర్రం మట్టి విగ్రహం బయల్పడింది 2) ఈ నగరాన్ని ఆర్.ఎస్. బిస్త్ కనుగొన్నారు 3) ఇది హర్యానాలోని హిస్సార్ జిల్లాలోఉంది 4) ఆవాలు, మేలు రకం బార్లీ, నువ్వులకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయి
సమాధానం: 1
21. సింధు నాగరికత కాలంలో ఉన్నత, మధ్య, దిగువ తరగతి వర్గాల గృహాల సముదాయం ఏ పట్టణంలో గమనించవచ్చు? 1) సుర్కటోడ 2) దోలవీర 3) లోథాల్ 4) హరప్పా
సమాధానం: 2
22. సింధు నాగరికత ముఖ్య లక్షణాల్లో సరికానిది? 1) గ్రిడ్ పద్ధతిలో నిర్మించిన ‘పట్టణ నాగరికత’ 2) క్రీట్ రాజధాని నాసన్‌లోనూ సింధు నాగరికత కాలంలో ఉన్న మాదిరిగా ‘మురుగు నీటి’ వ్యవస్థ ఉంది 3) సింధు కాలంలో అనేక నాగళ్లు బయల్పడ్డాయి 4) పరిశ్రమలను నగరాలకు దూరంగా నిర్మించారు
సమాధానం: 3
23.సింధు ప్రజల ఆర్థిక విధానానికి సంబంధిం చని అంశం? 1) ప్రపంచంలోనే తొలిసారిగా పత్తిని పండించారు 2) గబర్‌బండ లేదా నల అనే నీటి రిజర్వాయర్ దోలవీరలో కనుగొన్నారు 3) సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము 4) వరిని మొదట హరప్పా ప్రాంతంలో పండించారు
సమాధానం: 4
24. ఆది మానవులు వ్యవసాయాన్ని ఏ యుగంలో ప్రారంభించారు? 1) మధ్యరాతి 2) పాతరాతి 3) లోహ 4) నవీన శిలా
సమాధానం:3
25. కింది వాటిలో క్వార్టిజైట్ రాళ్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం? 1) కృష్ణా నది 2) గోదావరి నది 3) కడప 4) ఆదిలాబాద్
సమాధానం: 3
26. దేశంలో ప్రస్తుతం నీగ్రో జాతికి చెందిన ప్రజలు ఎక్కడున్నారు? 1) కాశ్మీర్ 2) తమిళనాడు 3) మధ్యప్రదేశ్ 4) అండమాన్ నికోబార్ దీవులు
సమాధానం: 4
27. దేశంలో మొదట వేటి ఉనికికి సంబంధించిన ప్రమాణం లభించింది? 1) హరప్పా నాగరికత 2) వేదాలు 3) వెండి నాణేలు 4) రాగి సంస్కృతి
సమాధానం: 4
28. హరప్పా ప్రజలు పనిముట్లు, ఆయుధాలను దేనితో తయారు చేశారు? 1) రాయి 2) రాగి 3) రాయి, కంచు 4) రంగులు
సమాధానం: 3
29. మొహంజొదారో ముద్రికలను పోలిన ముద్రికలు లభించిన దేశం? 1) ఈజిప్టు 2) చైనా 3) సుమేరియా 4) అఫ్గానిస్తాన్
సమాధానం: 3
30. భారతదేశంలో రాగి, రాతి నాగరికత మొదట ఎక్కడ ప్రారంభమైంది? 1) ఉత్తరప్రదేశ్ 2) రాజస్థాన్ 3) గోవా 4) కశ్మీర్
సమాధానం: 1
31. దేశంలో రాతి, రాగి యుగ సంస్కృతులకు ప్రసిద్ధి చెందినవి? 1) గణేశ్వర్ 2) అజర్ గిలుంద్ 3) మాళ్వా 4) పైవన్నీ
సమాధానం: 4
32. "Father of Indian Archaeology"గా ఎవరిని వ్యవహరిస్తారు? 1) బెనర్జీ 2) జాన్ మార్షల్ 3) కన్నింగ్ హాం 4) 2, 3
సమాధానం: 4
33.సింధు నగరాల్లో అత్యంత పెద్దది ఏది? 1) మొహంజొదారో 2) హరప్పా 3) లోథాల్ 4) కాలీభంగన్ సమాధానం: 1 34.సింధు ప్రజల శిల్పకళా నైపుణ్యానికి మచ్చుతునక ఏది? 1) ధాన్యాగారం 2) మహా స్నానవాటిక 3) కంచు విగ్రహం 4) ఏదీకాదు సమాధానం: 2 35. సింధీ భాషలో కాలీభంగన్ పదానికి అర్థం? 1) తెల్లని గాజులు 2) నల్లని గాజులు 3) ఎర్రని గాజులు 4) ఆకుపచ్చని గాజులు సమాధానం: 2 36. హరప్పా ప్రజలు ఆచరించిన మతానికి సంబంధించని లక్షణం? 1) ప్రకృతి ఆరాధన 2) ఆది పరాశక్తి ఆరాధన 3) మంత్రబలి 4) పునర్జన్మపై విశ్వాసం సమాధానం: 3 37. సింధు ప్రజల చిత్రలిపికి మరో పేరు? 1) హీలియోగ్రాఫిక్ 2) పాలిగ్రాఫిక్ 3) రోమాగ్రామ్ 4) జుయలిక్ సమాధానం: 4 38. సింధు నాగరికత సమకాలీన కొత్త రాజధాని ఏది? 1) ఏథెన్స్ 2) స్పార్టా 3) నాసస్ 4) ఆర్‌మన్ సమాధానం: 3 39. ‘విద్’ అనే పదం నుంచి ‘వేదాలు’ అనే పదం ఆవిర్భవించింది. ‘విద్’ అంటే అర్థం? 1) పవిత్రమైన 2) సిద్ధాంతం 3) భగవంతుడు 4) జ్ఞానం సమాధానం: 4 40. కింది వాటిలో ఉపనిషత్ ఏది? 1) చాందోగ్య 2) పాదసేవ 3) ఆత్రేయ 4) ఏదీకాదు సమాధానం: 1 41. గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది? 1) రుగ్వేదం 2) యజుర్వేదం 3) ఉపనిషత్ 4) సామవేదం సమాధానం: 1 42. మంత్రాలు, మంత్రోచ్ఛారణకు ప్రాధాన్యం ఇచ్చే వేదం ఏది? 1) రుగ్వేదం 2) సామవేదం 3) అధర్వణ వేదం 4) యజుర్వేదం సమాధానం: 4 43. నాలుగు వేదాల్లో.. సంగీత స్వరాల గురించి ఎందులో పేర్కొన్నారు? 1) అధర్వణ వేదం 2) సామవేదం 3) రుగ్వేదం 4) యజుర్వేదం సమాధానం: 2 44. కింది వాటిలో ఆర్యులకు సంబంధించని వృత్తి ఏది? 1) కుండలు తయారు చేయడం 2) వడ్రంగి పని 3) కమ్మరి పని 4) ఆభరణాల తయారీ సమాధానం: 4 45. వేదకాలం నాటి సమాజానికి సంబంధిం చిన అంశాలను వేటిలో ప్రస్తావించారు? 1) వేదాలు 2) స్మృతులు 3) పురాణాలు 4) ఉపనిషత్తులు సమాధానం: 4 46. రుగ్వేద కాలంలో ప్రధానంగా ఏ కుటుంబ వ్యవస్థ ఉండేది? 1) పితృస్వామ్య 2) మాతృస్వామ్య 3) 1, 2 4) ఏదీకాదు సమాధానం: 1 47. కింది వాటిలో పురాణాల్లో ప్రస్తావించని అంశం ఏది? 1) రెండో దశలో సృష్టి 2) మొదట్లో సృష్టి పెరిగిన విధానం 3) దేవతల వివరాలు 4) అంకగణితం సమాధానం: 4 48.వేదకాలంలోని ఆభరణాన్ని ‘నిష్క’గా వ్యవహరించేవారు. ఆ తర్వాత దీన్ని దేని తయారీలో వినియోగించారు? 1) ఆయుధం 2) లిపి 3) నాణెం 4) వ్యవసాయ పనిముట్లు సమాధానం: 3 49. రుగ్వేదంలో పేర్కొన్న గాయత్రి మంత్రాన్ని ఏ దేవతకు అంకితం చేశారు? 1) అగ్ని 2) వాయువు 3) సావిత్రి 4) సూర్యుడు సమాధానం: 3 50. రుగ్వేద కాలంలో ఎక్కువగా పూజలందుకున్న దేవత? 1) అగ్ని 2) శక్తి 3) వరుణుడు 4) స్త్రీ మూర్తి సమాధానం: 1 51. ఉపనిషత్తుల్లో కింద పేర్కొన్న అంశాల్లో దేని గురించి వివరించారు? 1) మతం 2) ఇంద్రుడు 3) వాయువు 4) అగ్ని సమాధానం: 1 52. సోనార్ ఏ ప్రాంతంలో ఉంది? 1) పంజాబ్ 2) గుజరాత్ 3) మహారాష్ర్ట 4) బెంగాల్ సమాధానం: 1 53. భేలమ్ లోయ ఏ ప్రాంతంలో ఉంది? 1) భీంబెట్కా 2) మీర్జాపూర్ 3) దిల్‌వానా 4) పల్లవరం సమాధానం: 2 54. అల్పపరిమాణంలో రాతి పరికరాలు ఎక్కువగా లభించిన ప్రాంతం? 1) భీంబెట్కా 2) మీర్జాపూర్ 3) దిల్‌వానా 4) బంగోర్ సమాధానం: 4 55. ఛీరండ్ ఏ రాష్ర్టంలో ఉంది? 1) తెలంగాణ 2) మధ్యప్రదేశ్ 3) బిహార్ 4) రాజస్థాన్ సమాధానం: 3 56. రాగి, రాతియుగపు నాగరికత మొదట ఏ రాష్ర్టంలో ప్రారంభమైంది? 1) తెలంగాణ 2) మధ్యప్రదేశ్ 3) బిహార్ 4) రాజస్థాన్ సమాధానం: 4 57. అజర్ గీలుంద్ అనే సంస్కృతి బయల్పడిన రాష్ర్టం? 1) తెలంగాణ 2) మధ్యప్రదేశ్ 3) బిహార్ 4) రాజస్థాన్ సమాధానం: 4 58. నవదతోలి సంస్కృతి ముఖ్యకేంద్రం? 1) మాల్వా 2) రాజస్థాన్ 3) గుజరాత్ 4) 1, 2 సమాధానం: 1 59. చంచోలి, సాన్‌గాన్ ముఖ్యకేంద్రాలు ఏ సంస్కృతికి చెందినవి? 1) జోర్వే 2) మాల్వా 3) అజర్‌గీలుంద్ 4) 2, 3 సమాధానం: 1 60. మాతృదేవతా విగ్రహం ఎక్కడ బయల్పడింది? 1) యారాన్ 2) ఇనాంగావ్ 3) దైమాబాద్ 4) సాన్‌గావ్ సమాధానం: 2 61. కుమ్మరి, కమ్మరి, దంతశిల్పులు మొదలైన పనివారు ఏ ప్రాంతంలో ఉండేవారు? 1) యారాన్ 2) ఇనాంగావ్ 3) దైమాబాద్ 4) సాన్‌గావ్ సమాధానం: 2 62. ఫాదర్ ఆఫ్ ఇండాలజీగా ప్రసిద్ధిచెందినవారు? 1) సర్ విలియం జోన్స్ 2) చార్లెస్ విల్కిన్స్ 3) సర్ జాన్ మార్షల్ 4) 1, 2 సమాధానం: 4 63. The sacred books of the East అనే గ్రంథాలకు ఎడిటర్‌గా పనిచేసినవారు? 1) సర్ విలియం జోన్‌స 2) చార్లెస్ విల్కిన్‌స 3) సర్ జాన్ మార్షల్ 4) మాక్స్ ముల్లర్ సమాధానం: 4 64. ‘ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1) 1858 2) 1860 3) 1861 4) 1921 సమాధానం: 3 65. సింధు నాగరికత కాలంలో ధోవతి ధరించిన విగ్రహం ఎక్కడ బయల్పడింది? 1) హరప్పా 2) బన్వాలి 3) కాళీబంగన్ 4) మెహంజొదారో సమాధానం: 1 66. ఆర్.ఎస్. బిస్త్ కింది వాటిలో ఏ నగరాన్ని కనుగొన్నారు? 1) బన్వాలి 2) ధోలవీర 3) సుర్కోటడ 4) రూపార్ సమాధానం: 1 67. లోహ పరికరాలు, పూసల ఆభరణాల తయారీ పరిశ్రమలు బయల్పడిన ప్రాంతం? 1) బన్వాలి 2) కాళీబంగన్ 3) ధోలవీర 4) చన్హుదారో సమాధానం: 4 68. జంతుబలి ఇవ్వడానికి నిర్మించిన అగ్నివేదికలు లభించిన ప్రాంతం? 1) ధోలవీర 2) సుర్కోటడ 3) బన్వాలి 4) కాళీబంగన్ సమాధానం: 4 69.కింది వాటిలో చిన్న రేవు పట్టణం? 1) లోథాల్ 2) సుర్కోటడ 3) బాలాకోట్ 4) సుర్కజండార్ సమాధానం: 2 70. సిందన్ అంటే? 1) బార్లీ 2) రాగులు 3) పత్తి 4) అరటి సమాధానం: 3 71. మురుగు నీటిపారుదల సౌకర్యాలు ఉన్న ప్రాంతాలు? 1) సింధు నాగరికత 2) నానస్ 3) ఈజిప్టు 4) 1, 2 సమాధానం: 4 72. ప్రాచీన - నవీన శిలాయుగాల మధ్య ‘మధ్య శిలాయుగం’ ఉందని చెప్పినవారు? 1) మోర్లాన్ 2) పాట్రిక్ 3) పీటర్‌సన్ 4) రాబర్ట్ బ్రూస్ ఫూట్ సమాధానం: 1 73. ‘నేను-నాది’ అనే ఆస్తి భావన, ముఖ్యంగా ప్రైవేటు ఆస్తి భావన ఎప్పుడు ప్రారంభమైంది? 1) నవీన రాతియుగం తొలి దశలో 2) నవీన రాతియుగం చివరి దశలో 3) మధ్యరాతియుగం తొలి దశలో 4) మధ్యరాతి యుగం చివరి దశలో సమాధానం: 2 74. మానవుడు మొదట తయారు చేసిన యాంత్రిక సాధనం ఏది? 1) బాణం 2) చక్రం 3) కుండ 4) మొన సమాధానం: 1 75. ‘ప్రీ హిస్టరీ’ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినవారు? 1) గార్బెన్ చైల్డ్ 2) డేనియల్ విల్సన్ 3) మర్టిమన్ వీలర్ 4) రాబర్ట్ బ్రూస్ ఫూట్ సమాధానం: 2 76. ప్రాక్ చరిత్ర కాలాన్ని శిలాయుగం, తామ్రశిలాయుగం, ఇనుప యుగం అని మూడు తరగతులుగా విభజించినవారు? 1) జఫర్సన్ థాంప్సన్ 2) రాబర్ట్ బ్రూస్ ఫూట్ 3) డెటెర్రా పీటర్‌సన్ 4) డేనియల్ విల్సన్ సమాధానం: 1 77. ‘క్వార్‌టరైజ్‌డ్ మానవుడు’ అని ఏ కాలపు మానవుడిని అంటారు? 1) పాతరాతియుగం 2) మధ్యరాతియుగం 3) నవీన రాతియుగం 4) నవీన శిలాయుగం సమాధానం: 1 78. ‘మెన్‌హిర్’లు అంటే ఏమిటి? 1) నదీ లోయలు 2) పంట భూములు 3) సమాధులు 4) రాతి పరిశ్రమలు సమాధానం: 3 79. మానవ జాతులను వర్గీకరించినవారు? 1) బ్రూస్ ఫూట్ 2) సర్‌జాన్ మార్షల్ 3) గుహ 4) హెన్రీ సమాధానం: 3 80. లాంగానాజ్ అంటే ఏమిటి? 1) సారవంతమైన ప్రాంతం 2) నదీలోయ ప్రాంతం 3) పర్వత ప్రాంతాలు 4) పనిముట్లు సమాధానం: 4 81.మానవుడి తొలి రాతిగొడ్డలి బయల్పడిన ప్రాంతం ఏది? 1) పల్లవరం 2) భింబెట్కా 3) చంద్రగిరి 4) స్వాత్ లోయ సమాధానం: 1 82. ప్రాచీన శిలా చిత్రాల్లో ప్రసిద్ధి చెందిన ‘గుర్రపు స్వారీ చేస్తున్న మనుషుల’ చిత్రాలు ఎక్కడ బయల్పడ్డాయి? 1) పల్లవరం 2) బుడిగపల్లి (తెలంగాణ) 3) సన్నతి (కర్ణాటక) 4) పైవన్నీ సమాధానం:2 83. ఆదిమానవుడి తొలి నివాస గృహాలు ఏ ఆకారంలో ఉండేవి? 1) దీర్ఘచతురస్రం 2) చతురస్రం 3) వృత్తాకారం 4) పైవన్నీ సమాధానం: 4 84. ఎరబలు అనే నీగ్రిటో జాతులు ఏ రాష్ర్టం లో ప్రసిద్ధి? 1) రాజస్థాన్ 2) పంజాబ్ 3) బిహార్ 4) తమిళనాడు సమాధానం: 4
No comments:
Post a Comment