Wednesday, September 14, 2016

Current Affairs Practice Bits

1. ఇటీవల ఈస్ట్ జోన్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది? (జాతీయం)
1) పాట్నా
2) రాంచీ
3) సిలిగురి
4) కటక్

View Answer

సమాధానం: 2
వివరణ: భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1956లో జోనల్ కౌన్సిల్ ఉండాలని ప్రతిపాదించారు. రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956 ద్వారా చట్టబద్ధ సంస్థలుగా జోనల్ కౌన్సిల్‌లు ఏర్పాటు చేశారు. జోనల్ కౌన్సిళ్ల చైర్మన్‌గా కేంద్ర హోం మంత్రి వ్యవహరిస్తారు. దేశంలో మొత్తం 6 జోనల్ కౌన్సిల్‌లు ఏర్పాటు చేశారు.

2. కృష్ణపట్నంలో గ్యాస్ ఆధారిత ఎరువుల ప్రాజెక్టు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? (జాతీయం)
1) హువాన్ కిన్ కాంట్రాక్ట్ అండ్ ఇంజినీరింగ్ కార్పోరేషన్
2) ఎల్‌ఈపీఎల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్
3) ఐసోమెరిక్ హోల్డింగ్స్
4) పైవన్నీ

View Answer

సమాధానం: 4
వివరణ: రూ. 10,183 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం గ్యాస్ ఆధారిత ఎరువుల పరిశ్రమను నిర్మించనున్నారు.

3. ఐస్‌లాండ్ నూతన అధ్యక్షుడు ఎవరు? (అంతర్జాతీయం)
1) ఘౌని జోహాన్నెసన్
2) హన్నెస్ హాఫ్‌స్టీన్
3) హర్మన్ జాన్సన్
4) గైర్ హరాడే

View Answer

సమాధానం: 1
వివరణ: ఐస్‌లాండ్ అధ్యక్షుడి పదవీ కాలం 4 సంవత్సరాలు. 1996 నుంచి 2016 వరకు ఓలాఫర్ రాగ్నార్ గ్రిమ్సన్ అధ్యక్షుడిగా ఉన్నారు. పనామా పత్రాల కుంభకోణం నేపథ్యంలో ఈసారి అధ్యక్ష పదవికి పోటీ చేయలేదు. అతని స్థానంలో ప్రముఖ చరిత్రకారుడు ఘౌని జోహాన్నెసన్ నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

4. కోపా (COPA) అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను ఏ జట్టు గెలుచుకుంది? (క్రీడలు)
 1) అర్జెంటీనా
2) బ్రెజిల్
3) చిలీ
4) ఈక్వెడార్

View Answer

సమాధానం: 3
వివరణ: కోపా అమెరికా ఫుట్‌బాల్ కప్‌ను దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ అని కూడా పిలుస్తారు. చిలీ ఈ టైటిల్ గెలవడం ఇది రెండోసారి. దక్షిణ అమెరికా బయట నిర్వహించిన మొదటి కోపా టోర్నమెంట్ కూడా ఇదే (యూఎస్‌ఏ).

5. ఒడిశాలో ‘కళింగ శిక్ష సాథీ యోజన’ ద్వారా విద్యార్థులకు ఎంత వడ్డీపై రుణాలు మంజూరు చేయనున్నారు? (జాతీయం)
1) 9 శాతం
2) 5 శాతం
3) 3 శాతం
4) 1 శాతం

View Answer

సమాధానం: )
వివరణ: ‘కళింగ శిక్ష సాథీ యోజన’ కోసం ఒడిశా ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించింది. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఒక శాతం వడ్డీతో రుణాలు ఇవ్వనున్నారు.

6. ‘అంబుబచి’ మేళా ఉత్సవం ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? (జాతీయం)
1) హర్యానా
2) అసోం
3) జమ్మూ కశ్మీర్
4) మిజోరాం

View Answer

సమాధానం: 2
వివరణ: అసోంలోని నీలాచల్ కొండల మీద కామాఖ్యదేవి ఆలయం (గువహటి) ఉంది. ప్రతి సంవత్సరం దేవీకి రుతుస్రావం అయ్యే సమయంలో అంబుబచి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఆలయంలో అవస్థాపన సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం రూ.25 కోట్లు కేటాయించింది.

7. హ్యూమన్ కేపిటల్ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? (అంతర్జాతీయం)
1) ఫిన్లాండ్
2) నార్వే
3) స్విట్జర్లాండ్
4) జపాన్

View Answer

సమాధానం: 1
వివరణ: హ్యూమన్ కేపిటల్ ఇండెక్స్‌ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం తయారుచేస్తుంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఫిన్లాండ్ ఉంది. రెండోస్థానంలో నార్వే, మూడో స్థానంలో స్విట్జర్లాండ్, నాల్గోస్థానంలో జపాన్‌లు ఉన్నాయి. ఆసియా దేశాలైన శ్రీలంక 50, చైనా 71, భూటాన్ 91, బంగ్లాదేశ్ 104, భారత్ 105 స్థానాల్లో నిలిచాయి.

8. ఇటీవల చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు గౌరవ డాక్టరేట్ అందజేసిన యూనివర్సిటీ ఏది? (అవార్డులు)
1) జేఎన్‌యూ
2) ఢిల్లీ యూనివర్సిటీ
3) ఐఐటీ కాన్పూర్
4) ఐఐటీ మద్రాస్

View Answer

సమాధానం: 3

9. క్వీన్స్ యంగ్ లీడర్స్ పురస్కారం 2016కు ఎంపికైనది ఎవరు? (అవార్డులు)
(i) ఒసామా బిన్ నూర్
(ii) కాల్వ్‌న్ యూంగ్‌షెన్ ఊ
(iii) టీనా ఆల్‌ఫ్రెడ్
(iv) కార్తీక్ సావ్నేయ్
1) (i) మాత్రమే
2) (i), (ii)
3) (i), (ii), (iii)
4) పైవన్నీ

View Answer

సమాధానం: 4
వివరణ: కామన్వెల్త్ దేశాల్లోని 18-29 మధ్య వయసు గల యువనాయకులు వారి సమాజాలకు చేసిన సేవలకు గుర్తుగా క్వీన్స్ యంగ్ లీడర్స్ పురస్కారాలు అందజేస్తారు. ఈ అవార్డును 2014లో ప్రారంభించారు. భారత్ నుంచి కార్తీక్ సావ్నేయ్, నేహా స్వెయిన్ ఎంపికయ్యారు.

10. ఇటీవల ఏ ఇస్లామిక్ దేశం మొదటిసారిగా షరియా హైకోర్టులకు మహిళా న్యాయమూర్తులను నియమించింది? (అంతర్జాతీయం)
1) ఇండోనేషియా
2) మలేషియా
3) ఒమన్
4) ఇరాన్

View Answer

సమాధానం: 2
వివరణ: ఇస్లామిక్ న్యాయ గ్రంథం షరియత్. నూర్ హుడా రోస్లన్, నెన్నే షుహైదా శంషుద్దీన్‌లను మలేషియా షరియా హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమించింది.

11. ఇటీవల సీఎస్‌ఐఆర్ ఏ వ్యాధిని నయం చేయడానికి ఆయుర్వేదిక్ టాబ్లెట్‌ను విడుదల చేసింది? (సైన్స్ అండ్ టెక్నాలజీ)
1) ఎయిడ్స్
2) డయాబెటిస్
3) మలేరియా
4) టైఫాయిడ్

View Answer

సమాధానం: 2
వివరణ: సీఎస్‌ఐఆర్-బీజీఆర్ 34 అనే పేరుతో టైప్-2 డయాబెటిస్‌ను తగ్గించడానికి ఆయుర్వేదిక్ టాబ్లెట్‌ను విడుదల చేసింది.

12. ‘ఎఫ్‌ఐహెచ్ ఛాంపియన్స్ ట్రోఫీ’ మహిళల హాకీ కప్‌ను గెల్చుకున్న దేశం ఏది? (క్రీడలు)
1) అర్జెంటీనా
2) చిలీ
3) నెదర్లాండ్స్
4) ఆస్ట్రేలియా

View Answer

సమాధానం: 1
వివరణ: లండన్‌లో జరిగిన మహిళల ఎఫ్‌ఐహెచ్ ఛాంపియన్ ట్రోఫీ టైటిల్‌ను అర్జెంటీనా గెల్చుకుంది. ఇప్పటి వరకూ అర్జెంటీనా ఈ టైటిల్‌ను ఏడుసార్లు సొంతం చేసుకుంది. ఎఫ్‌ఐహెచ్ ఛాంపియన్ ట్రోఫీని 1978లో పాకిస్థాన్ ఎయిర్ మార్షల్ నూర్ ఖాన్ ప్రారంభించారు. మహిళల ట్రోఫీని 1987 నుంచి నిర్వహిస్తున్నారు.

13. ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో 50 మీ. రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించింది ఎవరు? (క్రీడలు)
1) మాథ్యూ ఎమ్మాన్స్
2) కులిష్ షేర్హ్
3) కావ్ యైఫీ
4) సంజీవ్ రాజ్‌పుత్

View Answer

సమాధానం: 4

14. దేశంలో మొదటి ద్వీప జిల్లాను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? (జాతీయం)
1) నైల్లీ
2) మజూలీ
3) కాలపాని
4) పంబన్

View Answer

సమాధానం: 2
వివరణ: 1891లో మజూలీ ద్వీప వైశాల్యం 1250 చ.కి.మీ. మృత్తిక క్రమక్షయం వలన 2016 నాటికి ఈ ప్రాంత వైశాల్యం 400 చ.కి.మీ.కి తగ్గింది. ఈ ప్రాంతాన్ని అసోంలో 34వ జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు.

15. ఇటీవల యునిసెఫ్ విడుదల చేసిన ‘ప్రపంచ పిల్లల జాబితా - 2016’ ప్రకారం ప్రపంచంలో ఎంతమంది పిల్లలు పేదరికంలో మగ్గుతున్నారు? (అంతర్జాతీయం)
1) 200 మిలియన్లు
2) 189 మిలియన్లు
3) 167 మిలియన్లు
4) 143 మిలియన్లు

View Answer

సమాధానం: 3
వివరణ: ప్రపంచ పిల్లల జాబితా-2016 ప్రకారం 70 మిలియన్లకు పైగా బాలికలకు మైనర్లుగా ఉన్నపుడే వివాహాలు జరుగుతున్నాయి.

16. ప్రపంచబ్యాంక్ సహాయంతో జార్ఖండ్ రాష్ట్రం యుక్తవయసు బాలికల సాధికారత కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఏది? (జాతీయం)
1) తేజస్విని
2) పూర్ణిమ
3) గౌతమి
4) మనస్విని

View Answer

సమాధానం: 1

17. కింది వారిలో ‘గ్రేట్ ఇమ్మిగ్రెంట్: ది ప్రైడ్ ఆఫ్ అమెరికా 2016’ పురస్కారానికి ఎంపికైన భారత సంతతి వ్యక్తి ఎవరు? (అవార్డులు)
1) వినయ్ చోప్రా
2) బాబీ జిందాల్
3) సునీతా విలియమ్స్
4) సుందర్ పిచాయ్

View Answer

సమాధానం: 4
వివరణ: గ్రేట్ ఇమ్మిగ్రెంట్: ది ప్రైడ్ ఆఫ్ అమెరికా 2016 పురస్కారానికి భారత సంతతికి చెందిన నలుగురు ఎంపికయ్యారు. సుందర్ పిచాయ్ (గూగుల్), హరి శ్రీనివాసన్ (పీబీఎస్ న్యూస్ అవర్), విక్రమ్ మల్హోత్ర (మెక్‌కిన్‌స్లే), భారతీ ముఖర్జీ (రచయిత)

18. భారత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)తో అవగాహన ఒప్పందం చేసుకున్న దేశం ఏది? (అంతర్జాతీయం)
1) బంగ్లాదేశ్
2) శ్రీలంక
3) భూటాన్
4) వియత్నాం

View Answer

సమాధానం: 3
వివరణ: భూటాన్‌కు చెందిన రాయల్ సివిల్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీతో అవగాహన ఒప్పందం చేసుకుంది.

19.ఇటీవల భారత్ ఏ దేశంతో జలవనరుల నిర్వహణ, అభివృద్ధి అంశంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? (అంతర్జాతీయం)
1) వియత్నాం
2) టాంజానియా
3) దక్షిణాఫ్రికా
4) మారిషస్

View Answer

సమాధానం: 2

20. ‘షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ 2016’ ఎక్కడ జరిగింది? (అంతర్జాతీయం)
1) తాష్కెంట్
2) న్యూఢిల్లీ
3) ఆస్తానా
4) షాంఘై

View Answer

సమాధానం: 1
వివరణ: షాంఘై కోఆపరేషన్ సమ్మిట్ 2016 రెండ్రోజుల పాటు ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో జరిగింది. 2017లోపు భారత్, పాకిస్థాన్‌లు ఈ సంస్థలో పూర్తి సభ్యత్వం పొందనున్నాయి.

21. ఇటీవల సౌరశక్తి ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంక్, భారత్‌కు ఎంత రుణం జారీ చేసింది? (ఆర్థికం)
1) 2 బిలియన్ డాలర్లు
2) 1 బిలియన్ డాలర్లు
3) 50 మిలియన్ డాలర్లు
4) 25 మిలియన్ డాలర్లు

View Answer

సమాధానం: 2

22. ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ రోడ్డును ప్రారంభించిన దేశం ఏది? (అంతర్జాతీయం)
1) ఐస్‌లాండ్
2) ఫిన్లాండ్
3) నార్వే
4) స్వీడన్

View Answer

సమాధానం: 4
వివరణ: ఎలక్ట్రిక్ రోడ్డు వ్యవస్థ వల్ల కార్బన్ డయాక్సైడ్ విడుదల తగ్గుతుంది. భారీ వాహనాల కోసం స్వీడన్‌లో మొదటి ఎలక్ట్రిక్ రోడ్డును ఏర్పాటు చేశారు.

23.రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారతీయ క్రీడాకారులకు అధికారిక స్పాన్సర్ ఎవరు? (క్రీడలు)
1) రిలయన్స్ జియో
2) విప్రో
3) అముల్
4) నెస్లే

View Answer

సమాధానం: 3

24. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన యాంటీ సబ్‌మెరైన్ టార్పిడో ‘వరుణాస్త్ర’ బరువు ఎంత? (సైన్స్ అండ్ టెక్నాలజీ)
1) 1.25 టన్నులు
2) 2 టన్నులు
3) 3.75 టన్నులు
4) 5 టన్నులు

View Answer

సమాధానం: 1
వివరణ: డీఆర్‌డీవోకి చెందిన ‘నావల్ సైన్స్ అండ్ టెక్నాలాజికల్ లేబోరేటరీ’ యాంటీ సబ్‌మెరైన్ టార్పిడో వరుణాస్త్రను తయారు చేసింది. దీని బరువు 1.25 టన్నులు. 250 కేజీల బరువు గల పేలుడు పదార్థాలను 40 నాటికల్ మైళ్ల వేగంతో ఇది మోసుకుపోగలదు.

25. భారతీయ రైల్వే ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన పోర్టల్ ఏది? (జాతీయం)
1) రైల్వే జ్యోతి
2) నివారణ్
3) పరిష్కార్
4) రైల్వే ఉద్యోగ్

View Answer

సమాధానం: 2

26. దేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కంపెనీ ఏది? (జాతీయం)
1) ఎస్సార్ పవర్
2) హిందుస్థాన్ పవర్
3) అదానీ పవర్
4) టాటా పవర్

View Answer

సమాధానం: 4
వివరణ: ముంబై నగరానికి 3000 మెగావాట్ల విద్యుత్ కొరత ఉంది. ఈ కొరత తీర్చడానికి టాటా పవర్ నుంచి మహారాష్ట్ర 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయనుంది.

27. ప్రతిష్టాత్మక నాసా గ్లోబల్ కాంపిటీషన్ పురస్కారానికి ఎంపికైన జట్టు ఏది? (సైన్స్ అండ్ టెక్నాలజీ)
1) టెస్టర్
2) బోల్ట్
3) స్క్రూ డైవర్
4) ఎలక్ట్రిసిటీ

View Answer

సమాధానం: 3
వివరణ: ముఖేష్ పటేల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన 13 మంది విద్యార్థులు కలిసి స్క్రూ డైవర్ అనే జట్టు ఏర్పాటుచేసుకుని, అలోహ టీమ్ స్పిరిట్ పురస్కారానికి ఎంపికయ్యారు.

28. ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిన తేలికపాటి విమానం ఏది? (సైన్స్ అండ్ టెక్నాలజీ)
1) ఆకాశ్ - 2
2) తేజస్
3) ధనుష్ - 3
4) పృథ్వీ - 10

View Answer

సమాధానం: 2
వివరణ: నాల్గో తరానికి చెందిన తేలికపాటి, ఒకే ఇంజిన్ గల సూపర్ సోనిక్ విమానం ఎల్‌సీఏ తేజస్. హెచ్‌ఏఎల్, ఏడీఏలు సంయుక్తంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఎల్‌సీఏ తేజస్‌ను తయారుచేశారు. నౌకాదళంలో మిగ్-21 స్థానంలో తేజస్‌ను ఉపయోగించనున్నారు.

29. భారత్ - ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా తయారుచేసిన బారాక్-8 క్షిపణి ఏ లాంచింగ్ పరిధికి చెందినది? (సైన్స్ అండ్ టెక్నాలజీ)
1) ఉపరితలం నుంచి గగనతలంలోకి
2) ఉపరితలం నుంచి ఉపరితలం మీదకి
3) గగనతలం నుంచి సముద్రం మీదకి
4) సముద్రం నుంచి గగనతలంలోకి

View Answer

సమాధానం: 1
వివరణ: బారాక్-8 క్షిపణి మధ్యరకానికి చెందిన ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి. 70 కి.మీ. పరిధిలో ఆకాశ మార్గాన వచ్చే ఎటువంటి సూపర్ సోనిక్ విమానాన్ని, క్షిపణినైనా ఎదుర్కోగలదు.

30. జాతీయ డాక్టర్ల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? (జాతీయం)
1) జూలై 8
2) జూలై 5
3) జూలై 3
4) జూలై 1

View Answer

సమాధానం: 4
వివరణ: డా. బిదున్ చంద్రరాయ్ జన్మదినాన్ని జాతీయ డాక్టర్ల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా పనిచేశారు. డాక్టర్ల దినోత్సవాన్ని 1991 నుంచి ప్రతి ఏడాది జూలై1న నిర్వహిస్తున్నారు.

31.ఇటీవల ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ‘సరుకు రవాణా పనితీరు సూచీ’లో భారత్ ర్యాంకు ఎంత? (అంతర్జాతీయం)
1) 54
2) 35
3) 20
4) 17

View Answer

సమాధానం: 2
వివరణ: ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రపంచబ్యాంక్ ‘లాజిస్టిక్ ఫర్ఫార్మెన్స్ సూచీ’ని విడుదల చేస్తుంది.

32. ఇటీవల రైల్వే ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ ఏ దేశానికి 60 బ్రాడ్‌గేజ్ ప్యాసింజర్ కోచ్‌లను సరఫరా చేసింది? (అంతర్జాతీయం)
1) భూటాన్
2) శ్రీలంక
3) బంగ్లాదేశ్
4) మయన్మార్

View Answer

సమాధానం: 3
వివరణ: రైల్వే ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీస్ 120 బ్రాడ్‌గేజ్ కోచ్‌లు బంగ్లాదేశ్‌కు పంపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి విడతగా 60 ప్యాసింజర్ కోచ్‌లను పంపించింది.

33. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా విన్యాసాలు ఎక్కడ జరిగాయి? (అంతర్జాతీయం)
1) హవాయి
2) మారిషస్
3) మరియానా
4) కోరల్ దీవులు

View Answer

సమాధానం:1
వివరణ: RIMPAC 2016 పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ నౌకా విన్యాసాలు హవాయిలో జరిగాయి. 1971 నుంచిప్రతి రెండేళ్లకొకసారిఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఇందులో మొత్తం 26 దేశాలు పాల్గొన్నాయి. భారత్ తరఫున ఐఎన్‌ఎస్ సాత్పూరా పాల్గొంది.

34. దేశంలో గ్రిడ్‌కు అనుసంధానమయ్యే పైకప్పు సౌరఫలకల ప్రాజెక్టు (Rooftop Solar Project)కు ఆర్థిక సాయం చేయనున్న బ్యాంకు ఏది? (ఆర్థికం)
1) ఆసియా అభివృద్ధి బ్యాంకు
2) న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు
3) ప్రపంచ బ్యాంకు
4) సింగపూర్ బ్యాంకు

View Answer

సమాధానం: 3
వివరణ: భారత్‌లో రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంక్ 625 మిలియన్ డాలర్ల రుణాన్ని అందజేయనుంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకుంది.

35. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) తెలంగాణ చైర్మన్ ఎవరు? (వార్తల్లో వ్యక్తులు)
1) సంగీత రెడ్డి
2) దేవేంద్ర సూరన
3) ప్రభాకర రావు
4) అవినాశ్ వశిష్ఠ

View Answer

సమాధానం:2
వివరణ: అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డెరైక్టర్ సంగీత రెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాల ఫిక్కీ చైర్మన్గా వ్యవహరించారు. ఈమె పదవీ కాలం ముగియడంతో రెండు రాష్ట్రాలకు వేర్వేరు చైర్మన్‌లను నియమించారు. తెలంగాణ ఫిక్కీ చైర్మన్‌గా భాగ్యనగర్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ దేవేంద్ర సూరన, ఆంధ్ర ప్రదేశ్ ఫిక్కీ చైర్మన్‌గా ఎం. ప్రభాకర రావు (ఎన్‌ఎస్‌ఎల్ గ్రూప్) నియమితులయ్యారు.

36. ప్రపంచంలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ఎక్కడ ఉంది? (సైన్స్ అండ్ టెక్నాలజీ)
1) నార్వే
2) చైనా
3) రష్యా
4) కెనడా

View Answer

సమాధానం: 2
వివరణ: 180 మిలియన్ డాలర్ల వ్యయంతో అంతరిక్ష పరిశోధనలు, గ్రహాంతర వాసుల అన్వేషణ కోసం చైనాలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణాన్ని 2011లో ప్రారంభించారు.

37. ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రి ఫార్ములావన్ 2016 టైటిల్ విజేత ఎవరు? (క్రీడలు)
1) నికో రోస్‌బర్గ్
2) మాక్స్ వెస్తరెప్పన్
3) సెబాస్టియన్ వెటెల్
4) లూయిస్ హామిల్టన్

View Answer

సమాధానం: 4

38. స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న దేశాల్లో భారత్ ర్యాంకు ఎంత? (ఆర్థికం)
1) 75
2) 61
3) 50
4) 40

View Answer

సమాధానం: 1
వివరణ: 2015లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల దాచుకున్న మొత్తం 1.217.6 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్. అది 2016లో 596.42 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు తగ్గింది. 2015లో భారత్ ర్యాంకు 61 కాగా 2016లో 75. స్విస్ బ్యాంకుల్లో ఎక్కువ డబ్బు దాచుకున్న దేశం యూకే.

39. బ్రిక్స్ దేశాల రెండో యూత్ సమావేశం ఏ నగరంలో జరిగింది? (అంతర్జాతీయం)
1) ప్రిటోరియా
2) సోచి
3) గూరుజ
4) గువహటి

View Answer

సమాధానం: 4

40. ఇండియా జెట్ ఇంజిన్ ప్రాజెక్ట్ పునరుద్ధరణకు 1 బిలియన్ యూరోల ఆర్థిక సాయం అందించిన దేశం ఏది? (ఆర్థికం)
1) కెనడా
2) రష్యా
3) ఫ్రాన్స్
4) జర్మనీ

View Answer

సమాధానం: 3
వివరణ: 2014లో కావేరి ఇంజిన్‌లో కొన్ని లోపాలు రావడంతో దాని వాడకం ఆపేశారు. 2020లోపు కావేరి ఇంజిన్‌ను పునరుద్ధరించడమే ఇండియా జెట్ ఇంజిన్ ప్రాజెక్టు లక్ష్యం. ఇందుకు ఫ్రాన్స్ 1 బిలియన్ యూరోలు ఆర్థిక సాయం చేయనుంది.

41. జగన్నాథ రథయాత్రలు పురస్కరించుకుని సైకతాశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఏ బీచ్‌లో 100 ఇసుక రథాలను తయారుచేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు? (వార్తల్లో వ్యక్తులు)
1) బలిహార చండీ బీచ్
2) పూరీ బీచ్
3) గోపాల్‌పూర్ బీచ్
4) ఆర్యపల్లి బీచ్

View Answer

సమాధానం: 2

42. ఆస్ట్రేలియా దిగువ సభకు ఎన్నికైన మొదటి దేశీతెగ (ఇండీజెనస్)కుచెందిన మహిళ ఎవరు? (వార్తల్లో వ్యక్తులు)
1) ఆండ్రియా వాడాడేవిస్
2) మార్థా జాన్‌కానరే
3) అని ఓక్లే
4) లిండా బర్నీ

View Answer

సమాధానం: 4
వివరణ: ఆస్ట్రేలియా స్థానిక తెగ ‘ఆబోరిజనల్’కు చెందిన లిండా బర్నీ దేశ దిగువ సభకు ఎన్నికయ్యారు. ఎగువ సభకు ఎన్నికైన మొదటి స్థానిక తెగ మహిళ నోవా పేరిస్.

43. ‘కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ - 2016’ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? (క్రీడలు)
1) సాయి ప్రణీత్
2) లీ హ్యూన్ ఇల్
3) లీ చాంగ్ వై
4) టాన్ చూన్ సేంగ్

View Answer

సమాధానం: 1
వివరణ: కొరియాకు చెందిన లీ హ్యూన్ ఇల్‌ను ఓడించి భారత్‌కు చెందిన సాయి ప్రణీత్ బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. డబుల్స్ టైటిల్‌ను మను అత్రి, సుమేథ్ రెడ్డి గెల్చుకున్నారు.

44. ఇటీవల ఏ రైల్వేస్టేషన్ పేరును డా. బి.ఆర్. అంబేడ్కర్ నగర్‌గా పేరు మార్చారు? (జాతీయం)
1) పుణె
2) నాగ్‌పూర్
3) మౌ
4) ఇండోర్

View Answer

సమాధానం: 3
వివరణ: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఉన్న మౌ (Mhow) పట్టణం పేరును 2003లో డా. బి.ఆర్. అంబేద్కర్ నగర్‌గా ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. తాజాగా రైల్వే స్టేషన్ పేరును కూడా మార్చారు.

45. ఇటీవల ఏ రాష్ట్రంలో స్థానిక ఎయిర్‌పోర్టుల అభివృద్ధి కోసం రూ. 400 కోట్లు కేటాయించారు? (జాతీయం)
1) మహారాష్ట్ర
2) ఉత్తర ప్రదేశ్
3) మధ్య ప్రదేశ్
4) రాజస్థాన్

View Answer

సమాధానం: 2

46.భారత్‌లో మొదటిసారిగా వాణిజ్య కోర్టులు ప్రారంభించిన రాష్ట్రం ఏది? (ఆర్థికం)
1) గుజరాత్
2) గోవా
3) మహారాష్ట్ర
4) ఛత్తీస్‌గఢ్

View Answer

సమాధానం: 4

47. ‘ఇంధన పొదుపు - ఇంధన సామర్థ్యం’ పేరుతో బ్రిక్స్ దేశాల సమావేశం ఎక్కడ జరిగింది? (జాతీయం)
1) గువహటి
2) సోచి
3) విశాఖపట్నం
4) నైనిటాల్

View Answer

సమాధానం: 3
వివరణ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల వర్కింగ్ గ్రూప్ ‘ఇంధన పొదుపు-ఇంధన సామర్థ్యం’ పేరుతో సమావేశం నిర్వహించింది.

48. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో 39వ అసోసియేట్ మెంబర్‌గా చేరిన దేశం ఏది? (క్రీడలు)
1) యూఏఈ
2) సౌదీ అరేబియా
3) నైజీరియా
4) నమీబియా

View Answer

సమాధానం: 2
వివరణ: 2003 నుంచి సౌదీ అరేబియా ఐసీసీకి అనుబంధ సభ్యదేశంగా ఉంది. ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో సౌదీ అరేబియాను 39వ అసోసియేట్‌గా గుర్తించారు. ఐసీసీలో శాశ్వత సభ్యదేశాలు - 10, అసోసియేట్ దేశాలు - 39, అనుబంధ సభ్యదేశాలు - 56

49. IWAS ప్రపంచ క్రీడల 200 మీ. ఫ్రీ స్టైల్ ఈత పోటీల్లో బంగారు పతక విజేత ఎవరు? (క్రీడలు)
1) నిరంజన్ ముకుందన్
2) బ్రాడ్ స్నైడర్
3) జౌ రైలే రివార్డ్
4) డేవిడ్ గ్రా చాట్

View Answer

సమాధానం: 1
వివరణ: బెంగళూరుకు చెందిన పారా స్విమ్మర్ నిరంజన్ ముకుందన్ ప్రెగ్‌లో జరిగిన IWAS ప్రపంచ క్రీడల్లో 8 పతకాలు సాధించాడు. 200 మీ. ఫ్రీస్టైల్, 50 మీ. బటర్ ఫ్లై, 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగాల్లో నిరంజన్ బంగారు పతకాలు సాధించాడు.

50. ప్రతిష్టాత్మక 17వ కైన్ ఆఫ్రికన్ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? (అవార్డులు)
1) లైలా అబులేలా
2) హైలాన్ హబిలా
3) నామవలి సెర్‌పెల్
4) లిడుడులింగానీ మక్యూఓంబూతి

View Answer

సమాధానం: 4
వివరణ: ఒరిజినల్ షార్ట్‌స్టోరీలను ఇంగ్లిష్‌లో రాసిన ఆఫ్రికా రచయితలకుకైన్ ఆఫ్రికన్ పురస్కారం అందజేస్తారు. దీన్ని సర్ మైఖేల్ హారిస్ కైన్ గౌరవార్థం 2000లో ఏర్పాటు చేశారు. లిడుడులింగానీ రాసిన ‘మెమొరీస్ వియ్ లాస్ట్’ కథకు కైన్ పురస్కారం లభించింది.⁠⁠⁠⁠

1. జూపిటర్ గ్రహంపై అధ్యయనం కోసం నాసా పంపిన కృత్రిమ ఉపగ్రహం పేరేమిటి?
1) జునో
2) టైటాన్
3) లో
4) కార్పో

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: జూపిటర్ గ్రహాన్ని అధ్యయనం చేయడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జునో అనే కృత్రిమ ఉపగ్రహాన్ని 2011లో అంతరిక్షంలోకి పంపింది. ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తరువాత జునో ఇటీవల జూపిటర్ కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ఉపగ్రహం జూపిటర్ నిర్మాణం, గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి గురించి అధ్యయనం చేస్తుంది.

2. ‘జాతీయ ఈ-విధాన్ అకాడమీ’ని ఎక్కడ ప్రారంభించనున్నారు?
1) అకోలా
2) పుణే
3) ధర్మశాల
4) అమృత్‌సర్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ఎంపీ, ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వడానికి ‘జాతీయ ఈ-విధాన్ అకాడమీ’ని ధర్మశాలలో ప్రారంభిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ భూటాల్ వెల్లడించారు.

3. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత దేశీయ విమాన రంగంలో వార్షిక వృద్ధి రేటు ఎంత?
1) 20%
2) 18.8%
3) 15.8%
4) 13.2%

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: IATA ఏటా విమాన రంగ అభివృద్ధి గురించి నివేదికను విడుదల చేస్తుంది. 2016 నివేదిక ప్రకారం భారత దేశీయ విమాన రంగ వార్షిక వృద్ధి రేటు 18.8%.

4. ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్‌లో ఎంత శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది?
1) 45
2) 55
3) 62
4) 74

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: యాక్సిస్ బ్యాంక్‌లో ఇప్పటి వరకు 62 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మాత్రమే అనుమతి ఉండేది. కొత్తగా పెంచిన 74 శాతం ఎఫ్‌డీఐల వల్ల దేశంలోకి రూ. 12,97,314 కోట్ల నిధులు వస్తాయి.

5. ‘వరల్డ్ క్లాస్ జిమ్నాస్ట్’ అవార్డు అందుకున్న క్రీడాకారిణి ఎవరు?
1) అలై రెయిజ్‌మన్
2) షాన్ జాన్సన్
3) దీపా కర్మాకర్
4) గాబీ డాగ్లస్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ‘వరల్డ్ క్లాస్ జిమ్నాస్ట్’ అవార్డు అందుకున్న మొదటి భారత మహిళా జిమ్నాస్ట్‌గా దీపా కర్మాకర్ నిలిచింది. భారత్ నుంచి రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన ఏకైక జిమ్నాస్ట్ కూడా దీపానే.

6. స్వచ్ఛ భారత్ మిషన్ పైలట్ ప్రాజెక్ట్ కింద భారత్‌లోని ఎన్ని సందర్శన ప్రాంతాలను శుభ్రం చేయనున్నారు?
1) 15
2) 10
3) 5
4) 4

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: స్వచ్ఛ భారత్ మిషన్ పైలట్ ప్రాజెక్ట్ కింద శుభ్రం చేయడానికి జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవీ ఆలయం, తాజ్‌మహల్, తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయం, అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం, అజ్మీర్ దర్గా, ఒడిశాలోని జగన్నాథ ఆలయం, ముంబైలోని చత్రపతి శివాజీ టెర్మినల్, ఉత్తర ప్రదేశ్‌లోని మణికర్ణిక ఘాట్, మదురై మీనాక్షి ఆలయం, అస్సాంలోని కామాఖ్య ఆలయాలను ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ వెల్లడించారు.

7. బ్రిక్స్ దేశాల మాదకద్రవ్య నిరోధక సంఘాల అధిపతుల (Heads of Drug Control Agencies of BRICS countries) రెండో సమావేశం ఎక్కడ జరిగింది?
1) ప్రిటోరియా
2) న్యూఢిల్లీ
3) ఫోర్తలేజా
4) రియో డి జెనిరో

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఆధ్వర్యంలో బ్రిక్స్ దేశాల డ్రగ్స్ కంట్రోల్ ఏజెన్సీస్ అధిపతుల సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.

8. భారత్ ఏ దేశంలో వస్త్రాల తయారీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది?
1) నైజీరియా
2) ఘనా
3) బిర్కినాఫాసో
4) గోల్డ్‌కోస్ట్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: నైజీరియా రాజధాని అబుజా. కరెన్సీ నైజీరియన్ నైరా

9. భారతీయ జానపద నృత్య భంగిమలను తమ పోస్టల్ స్టాంపులపై ముద్రించనున్న దేశం ఏది?
1) పోర్చుగల్
2) ఇటలీ
3) జర్మనీ
4) కెనడా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో భాగంగా భారతీయ జానపద నృత్య భంగిమలను పోర్చుగల్ తమ పోస్టల్ స్టాంపులపై ముద్రించనుంది.

10. భారత్‌లో అతిపెద్ద గ్యాస్ దిగుమతి సంస్థ ఏది?
1) ఓఎన్‌జీసీ
2) ఇండియన్ ఆయిల్
3) పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ
4) రిలయన్స్ పెట్రో

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: భారత ప్రభుత్వ రంగ సంస్థ పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ.. బంగ్లాదేశ్‌లోని ‘కుతుబ్దియా’ ద్వీపంలో రూ. 5 వేల కోట్ల వ్యయంతో ద్రవీకృత సహజ వాయువు (LNG) దిగుమతి టెర్మినల్‌ను ఏర్పాటు చేయనుంది. అలాగే శ్రీలంకలోని కూడా ఒక మెట్రిక్ టన్ను ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనుంది.

11. భారత్‌లోని ఏ మైదానంలో అంతర్జాతీయ హాకీ పోటీలు నిర్వహించడానికి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అనుమతినిచ్చింది?
1) ఎల్.బి. స్టేడియం
2) ఫిరోజ్ షా కోట్ల స్టేడియం
3) అన్నా స్టేడియం
4) మేజర్ ధ్యాన్‌చంద్ హాకీ గ్రౌండ్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: రాజ్‌కోట్‌లోని మేజర్ ధ్యాన్‌చంద్ హాకీ గ్రౌండ్‌ను అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (FIH) గుర్తించింది. ఈ మైదానం అభివృద్ధికి ఎఫ్‌ఐహెచ్ రూ. 5 కోట్లు ఖర్చు చేసింది.

12. భారత్‌లో ‘ఫ్యాట్ ట్యాక్స్’ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) గోవా
3) సిక్కిం
4) కేరళ

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: జంక్ ఫుడ్స్‌పై 14.5 శాతం ఫ్యాట్ ట్యాక్స్‌ను కేరళ ప్రభుత్వం విధించింది. ప్రపంచంలో మొదటిసారిగా ఫ్యాట్ ట్యాక్స్‌ను విధించిన దేశం జపాన్. ఆ తరవాత డెన్మార్క్ ప్రవేశపెట్టింది.

13. ఇటీవల ఏ రాష్ట్రం ఆర్థిక మాంద్య పరిస్థితులను తట్టుకునేందుకు రూ. 12,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది?
1) కేరళ
2) గోవా
3) సిక్కిం
4) ఢిల్లీ

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం తమ మొదటి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రూ. 12,000 కోట్లతో ఆర్థిక మాంద్య నివారణ ప్యాకేజీని ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ ప్రకటించారు.

14. ఆసియాలోనే అతిపొడవైన సొరంగ మార్గాన్ని నిర్మించిన దేశం ఏది?
1) భారత్
2) జపాన్
3) చైనా
4) మంగోలియా

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ఆసియాలోనే అతిపొడవైన సొరంగ మార్గాన్ని చైనా క్విన్‌లింగ్ పర్వతాలలో నిర్మించింది. జియాన్ - చెంగ్డూ నగరాలను కలుపుతూ క్విన్‌లింగ్ పర్వతాలలో 16 కి.మీ. రైల్వే టన్నెల్‌ను నిర్మించారు.

15. ఇటీవల ప్రకటించిన ‘ప్రాథమిక ప్రజా సమర్పణ (Initial Public Offering)’ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది?
1) కోటక్ ఇన్వెస్ట్‌మెంట్
2) ఐసీఐసీఐ సెక్యూరిటీస్
3) యాక్సిస్ బ్యాంక్
4) హెచ్‌ఎస్‌బీసీ

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ప్రాథమిక ప్రజా సమర్పణ జాబితాలో రూ. 1216 కోట్లతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ నిలిచింది.

16. ఇంటర్నేషనల్ మారీటైమ్ ఆర్గనైజేషన్ (IMO) అందజేసే ప్రతిష్టాత్మక ‘అసాధారణ శౌర్యం (Exceptional Bravery)’ పురస్కారానికి ఎంపికైన తొలి మహిళ ఎవరు? 
1) కేట్ మెక్‌క్యూ
2) మైఖేల్ జెహ్వార్డ్
3) మెల్లి కూల్
4) రాధికా మీనన్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఇంటర్నేషనల్ మారీటైమ్ ఆర్గనైజేషన్‌ను సముద్ర భద్రత కోసం ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసింది. ఐఎంఓ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. సముద్రంలో సంభవించే ప్రమాదల నుంచి ప్రజలను, ఆస్తులను రక్షించడానికి సాహసం చేసిన వారికి ఎక్సెంప్షనల్ బ్రేవరీ అవార్డును అందజేస్తారు.

17. జమ్మూకశ్మీర్‌లో తొలి ‘సీడ్ ప్రాసెసింగ్ యూనిట్’ను ఎక్కడ ప్రారంభించనున్నారు?
1) కతువా
2) జమ్మూ
3) సాంబా
4) ఉద్ధమ్‌పూర్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: కశ్మీరీ రైతులకు ఉత్తమ, నాణ్యమైన విత్తనాలను అందజేయడానికి కతువా పట్టణంలో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

18. రష్యాలో నిర్వహించిన అంతర్జాతీయ పారిశ్రామిక వాణిజ్య ప్రదర్శన ‘ఇన్నోప్రామ్-2016 (INNOPROM)’లో భాగస్వామిగా ఏ దేశం వ్యవహరించింది?
1) జపాన్
2) దక్షిణ కొరియా
3) భారత్
4) మంగోలియా

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ఇన్నోప్రామ్‌ను రష్యాలోని ఎకటెరిన్‌బర్గ్ నగరంలో ఏటా నిర్వహిస్తారు. ఈ ఏడాది జూలై 11 నుంచి 14 వరకు ప్రదర్శన జరిగింది. దీనికి భాగస్వామిగా భారత్ వ్యవహరించింది. 2017లో నిర్వహించనున్న వాణిజ్య ప్రదర్శనకు జపాన్ భాగస్వామిగా వ్యవహరించనుంది.

19. ఈ ఏడాది నాటో వార్షిక సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) బ్రసెల్స్
2) వార్సా
3) బుడాపెస్ట్
4) బుకారెస్ట్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: పోలాండ్ రాజధాని వార్సా (Warsaw)లో 2016 నాటా వార్షిక సమావేశాన్ని నిర్వహించారు.

20. భారతీయ రైల్వే స్పెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న తేలికైన రైలు పేరేమిటి?
1) టాంగ్
2) వీపర్
3) జీనత్
4) టాల్గో

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: భారత్ వినియోగిస్తున్న రైలు బోగీల కంటే స్పెయిన్ తయారుచేసిన ‘టాల్గో’ రైలు బోగీలు 30 శాతం తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయి. ఈ రైలు టెస్ట్ రన్‌లో గంటకు 180 కి.మీ. వేగంతో నడిచింది.

21. వింబుల్డన్ 2016 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు?
1) సెరెనా విలియమ్స్
2) వీనస్ విలియమ్స్
3) విక్టోరియా అజరెంకా
4) ఏంజెలిక్ కెర్బర్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: జర్మనీ టెన్నిస్ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్‌ను ఓడించి సెరెనా విలియమ్స్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

22. స్పానిష్ గ్రాండ్ ప్రి రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన భారత రెజ్లర్ ఎవరు?
1) సుశీల్ కుమార్
2) సందీప్ తోమర్
3) నర్సింగ్ యాదవ్
4) యోగేశ్వర్ దత్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: స్పానిష్ గ్రాండ్ ప్రిలో భారత రెజ్లర్లు సందీప్ తోమర్ (57 కేజీ), నర్సింగ్ యాదవ్ (74 కేజీ) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు.

23. కింది ఏ దేశాల నుంచి దిగుమతి అవుతున్న రసాయనాలపై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది?
i) చైనా
ii) ఇరాన్
iii) ఇండోనేషియా
iv) జపాన్
1) i మాత్రమే
2) ii, iii, iv
3) i, ii, iii
4) పైవన్నీ

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: వస్త్ర పరిశ్రమలో వాడే రసాయనాలను భారత మార్కెట్‌లో తక్కువ ధరకు అమ్మడానికి చైనా, ఇరాన్, ఇండోనేషియా, మలేసియా, తైవాన్ దేశాలు భారత్‌కు ఎగుమతి చేస్తున్నాయి. స్థానిక పరిశ్రమల రక్షణ కోసం దిగుమతి అవుతున్న రసాయనాలపై 1 టన్నుకు 168.76 డాలర్ల యాంటీ డంపింగ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వంవిధించింది.

24. బీహార్‌లో పేదరిక నిర్మూలనకు ప్రపంచ బ్యాంక్ ఎంత రుణం మంజూరు చేసింది?
1) 100 మి. డాలర్లు
2) 150 మి. డాలర్లు
3) 290 మి. డాలర్లు
4) 310 మి. డాలర్లు

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: గ్రామీణ జనాభా స్వయం సహాయక బృందాలు ఏర్పాటు, పేదరిక నిర్మూలన కోసం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ‘జీవిక II (JEEViKA II)’ అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ 290 డాలర్ల రుణం మంజూరు చేసింది.

25. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన 100 పారదర్శక కార్పోరేట్ కంపెనీల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది ఏది?
1) భారతీ ఎయిర్‌టెల్
2) టీసీఎస్
3) ఇన్ఫోసిస్
4) టెక్ మహీంద్రా

View Answer

స‌మాధానం: 1

26. ప్రపంచంలో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ ఏది?
1) సీఎన్‌బీఎం
2) సినోమా
3) ఆల్ట్రాటెక్
4) లఫర్జే

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఫ్రాన్స్‌కు చెందిన లఫర్జే.. ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తి కంపెనీ. భారత్‌లో ఉన్న ఈ సంస్థ శాఖలను ‘నిర్మా లిమిటెడ్’ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ 1.4 బిలియన్ డాలర్లు.

27. గౌర్మాండ్ వరల్డ్ కుక్‌బుక్ అవార్డ్ 2015ను అందుకున్న భారత రచయిత ఎవరు?
1) కవితా కన్నన్
2) నిమి సునీల్ కుమార్
3) మృదుల బల్జేకర్
4) మంజు మల్హి

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: వంటకాలపై రాసిన పుస్తకాలకు ‘గౌర్మాండ్ వరల్డ్ కుక్‌బుక్ అవార్డు’ అందజేస్తారు. కేరళలోని వంటలపై నిమి సునీల్ కుమార్ రాసిన ‘4 o’clock Temptations of Kerala’ పుస్తకానికి ఈ అవార్డు దక్కింది.

28. అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAAI) అందజేసే జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
1) రంజిత్ గుప్తా
2) రాథామోహన్ స్వామి
3) శ్రీనివాసన్ కె. స్వామి
4) మున్నా దేశాయ్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: 1988లో ఏఏఏఐ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని స్థాపించారు. ప్రకటనల రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గౌరవించేందుకు ఏర్పాటుచేసిన అత్యున్నత పురస్కారం ఇది.

29. బ్యాంకింగ్ రంగంలో ఆసియాలోనే అత్యుత్తమ సీఈవోగా ఎవరు నిలిచారు?
1) ఆదిత్య పురి
2) భారతీ మిట్టల్
3) ఆదిత్య బిర్లా
4) ముఖేష్ అంబానీ

View Answer

స‌మాధానం: 1

30. కేంద్ర ప్రభుత్వం జాతీయ అరటి పరిశోధన కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది?
1) కేరళ
2) ఒడిశా
3) బీహార్
4) జార్ఖండ్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఉన్న ‘గోరౌల్’ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో జాతీయ అరటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

31. వింబుల్డన్ 2016 మహిళల డబుల్స్ టైటిల్ విజేతలు ఎవరు?
1) టైమియా బాబోస్, యరోస్లావా షెవడోవా
2) సానియా మీర్జా, మార్టినా హింగిస్
3) ఏంజెలిక్ కెర్బర్, విక్టోరియా అజరెంకా
4) సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్

View Answer

స‌మాధానం: 4

32. బ్రిటిష్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ టైటిల్ విజేత ఎవరు?
1) సెబాస్టియన్ వెటల్
2) లూయిస్ హామిల్టన్
3) నికో రోస్‌బర్గ్
4) డేనియల్ రికియార్డో

View Answer

స‌మాధానం: 2

33. యూరో ఫుట్‌బాల్ కప్ 2016ను గెలుచుకున్న జట్టు ఏది?
1) స్పెయిన్
2) పోర్చుగల్
3) ఆస్ట్రియా
4) ఫ్రాన్స్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: పారిస్‌లో జరిగిన యూరో ఫుట్‌బాల్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి పోర్చుగల్ టైటిల్‌ను గెలుచుకుంది. విజేత జట్టుకు 8 మిలియన్ యూరోలు, రన్నరప్ జట్టుకు 5 మిలియన్ యూరోల నగదు బహుమతి లభిస్తుంది.

34. ప్రపంచ జనాభా దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) జూలై 11
2) జూలై 14
3) జూలై 16
4) జూలై 20

View Answer

స‌మాధానం: 1

35. భారత్‌లో ఉదయ్ పథకం కింద మొట్టమొదటి స్మార్ట్ గ్రిడ్‌ను ఎక్కడ ప్రారంభించనున్నారు?
1) నోయిడా
2) నాసిక్
3) గుర్గావ్
4) బరంపురం

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: హరియాణాలోని గుర్గావ్‌లో స్మార్ట్ గ్రిడ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 273 కోట్ల సహాయాన్ని అందజేస్తుంది.

36. టాంజానియా దేశ రాజధాని పేరేమిటి?
1) మపుటో
2) డొడోమా
3) నైరోబి
4) కేప్‌టౌన్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా టాంజానియా రాజధాని డొడోమాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ దేశంతో వాతావరణ మార్పలు, తీవ్రవాదం, జలవనరుల నిర్వహణ-అభివృద్ధి మొదలగు అంశాలపై ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చకున్నారు.

37. కింది ఏ ఆఫ్రికా దేశంతో భారత్ ‘పప్పు ధాన్యాల దిగుమతి’కి ఒప్పందం చేసుకుంది?
1) కెన్యా
2) దక్షిణాఫ్రికా
3) టాంజానియా
4) మొజాంబిక్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: మొజాంబిక్ నుంచి భారత్ పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోనుంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే డ్రగ్స్ స్మగ్లింగ్, యువజన వ్యవహారాలు, క్రీడలకు సంబంధించి ఇరు దేశాలు పరస్పర సహకారాన్ని అందించుకోనున్నాయి.

38. రూ. 3000 కోట్ల పెట్టుబడుల సేకరణ కోసం మొదటిసారిగా ఏ బ్యాంక్ సింథటిక్ నోట్‌లను విడుదల చేసింది?
1) హెచ్‌డీఎఫ్‌సీ
2) ఐసీఐసీఐ
3) బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) ఇండియన్ బ్యాంక్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: విదేశీ పెట్టుబడిదారుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సింథటిక్ బాండ్‌లను విడుదల చేసింది. వీటి కాలపరిమితి మూడేళ్లు.

39. ఒక రోజులో ఐదు కోట్ల మొక్కలు నాటి ప్రపంచ రికార్డు నెలకొల్పిన రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) ఉత్తర ప్రదేశ్
4) మధ్య ప్రదేశ్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ఉత్తర ప్రదేశ్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఒక రోజులో 5.01 కోట్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డును సాధించింది. 2015లో మధ్య ప్రదేశ్‌లో ఒకే రోజు 1.43 కోట్ల మొక్కలు నాటారు.

40. 2015 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ‘జ్ఞాన్‌పీఠ్ అవార్డు’ గ్రహీత ఎవరు?
1) ప్రతిభ రాయ్
2) డా. రఘువీర్ చౌదరి
3) అమరకాంత్
4) శ్రీలాల్ శుక్లా

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: గుజరాతీ నవలా రచయిత డాక్టర్ రఘువీర్ చౌదరి 2015 సంవత్సరానికి గాను జ్ఞాన్‌పీఠ్ అవార్డును అందుకున్నారు. జూలై 11న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డును ఆయనకు అందజేశారు.

41. అంతర్జాతీయ మలాలా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
1) జూలై 12
2) జూలై 14
3) జూలై 17
4) జూలై 18

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: యూసఫ్ జాయ్ మలాలా పుట్టిన రోజు (జూలై 12)ను పురస్కరించుకుని, బాలికా విద్య ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి మలాలా డేను నిర్వహిస్తోంది. 2013లో తొలిసారి మలాలా డేను నిర్వహించారు.

42. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవులపై ఏ దేశానికి హక్కులు లేవని అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పు వెల్లడించింది?
1) ఫిలిప్పీన్స్
2) బ్రూనై
3) ఇండోనేషియా
4) చైనా

View Answer

స‌మాధానం: 4

43. నేపాల్‌లోని ఏ నగరం నుంచి ఢిల్లీకి మొదటిసారి బస్ సర్వీస్‌ను ప్రారంభించారు?
1) ఖాట్మాండు
2) పొఖారా
3) ధరణ్
4) బందిపూర్

View Answer

స‌మాధానం: 2

44. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యధిక ఆదాయాన్ని గడిస్తున్న సెలబ్రిటీల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది ఎవరు?
1) జేమ్స్ పటెర్సన్
2) క్రిస్టియానో రొనాల్డో
3) టేలర్ స్విఫ్ట్
4) కెవిన్ హార్ట్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ 170 మిలియన్ డాలర్ల సంపాదనతో ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలో బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ (33 మిలియన్ డాలర్లు) 86వ స్థానంలో, అక్షయ్ కుమార్ (31.5 మిలియన్ డాలర్లు) 94వ స్థానంలో ఉన్నారు.

45. బ్రిటన్ నూతన ప్రధాన మంత్రి ఎవరు?
1) థెరిసా మే
2) అంబర్ రుడ్జ్
3) జస్టిన్ గ్రీనింగ్
4) ఆండ్రియా లీడ్సమ్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: థెరిసా మే.. బ్రిటన్‌కు రెండో మహిళా ప్రధాన మంత్రి. ‘బ్రెగ్జిట్’ ప్రభావంతో డేవిడ్ కామెరూన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో థెరిసా మే నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టారు.

46. ఇటీవల కనుగొన్న RR245 మరగుజ్జ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?
1) 100
2) 300
3) 500
4) 700

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: నెఫ్ట్యూన్ గ్రహం ఆవల RR245 మరగుజ్జు గ్రహాన్ని కనుగొన్నారు.

47. అంతర్జాతీయ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూలై 10
2) జూలై 15
3) జూలై 17
4) జూలై 20

View Answer

స‌మాధానం: 2

48. దక్షిణ సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను కాపాడటానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరేమిటి?
1) వాయు పుత్ర
2) రక్షక్
3) సంకట్ మోచన్
4) సురక్ష

View Answer

స‌మాధానం: 3

49. WWF తాజా నివేదిక ప్రకారం షార్క్ చేపలను వేటాడుతున్న దేశాల జాబితాలో భారత్ స్థానం ఎంత?
1) 2
2) 5
3) 7
4) 9

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: WWF నివేదిక ప్రకారం షార్క్ చేపల వేటలో ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంది.

50. జికా వైరస్ కారణంగా తాజాగా ఏ దేశం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది?
1) బ్రెజిల్
2) చిలీ
3) పెరూ
4) ఉరుగ్వే

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: పెరూ దేశ ఉత్తర భాగంలో 102 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఉత్తర పెరూలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఆ దేశం ప్రకటించింది.⁠⁠⁠⁠
1. ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రపంచంలోనే తొలిసారిగా ‘డిజిటల్ స్టూడెంట్ ఇంక్యుబేటర్’ను ప్రారంభించారు?
1) గుజరాత్
2) కేరళ
3) తెలంగాణ
4) మహారాష్ట్ర

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: కాలేజీ విద్యార్థుల్లో వ్యవస్థాపక లక్షణాలను అభివృద్ధి చేయడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే తొలి ‘డిజిటల్ స్టూడెంట్ ఇంక్యుబేటర్’ను ప్రారంభించింది.

2. స్కైట్రాక్స్ ప్రకటించిన ‘2016 వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్స్’లో ఉత్తమ ఎయిర్‌లైన్‌గా ఎంపికైన విమానయాన సంస్థ ఏది?
1) ఎమిరేట్స్
2) ఖతార్ ఎయిర్వేస్
3) సింగపూర్ ఎయిర్‌లైన్స్
4) కాథే పసిఫిక్

View Answer

స‌మాధానం: 1

3. మెరైన్ కమాండోస్ యూనిట్ ‘ఐఎన్‌ఎస్ కర్ణ’ను ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా ఎక్కడ ప్రారంభించారు?
1) కొచ్చి
2) మంగళూరు
3) విశాఖపట్నం
4) కోల్‌కత్తా

View Answer

స‌మాధానం: 3

4. దేశంలో తొలిసారిగా ‘ఆనందం కోసం మంత్రిత్వ శాఖ (Ministry Of Happiness)’ను ఏర్పాటుచేసిన రాష్ట్రం ఏది?
1) హరియాణా
2) ఉత్తర ప్రదేశ్
3) మహారాష్ట్ర
4) మధ్య ప్రదేశ్

View Answer

స‌మాధానం: 4

5. దేశంలో తొలిసారిగా మహిళల కోసం పారిశ్రామిక పార్కును ఏర్పాటుచేయనున్న రాష్ట్రం ఏది?
1) ఉత్తరాఖండ్
2) ఉత్తర ప్రదేశ్
3) ఢిల్లీ 4) గోవా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కు ఏర్పాటుచేయనుంది.

6. ‘ఫైనాన్షియల్, డిజిటల్ టెక్నాలజీ’ అంశంపై అధ్యయనం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుచేసిన కమిటీ ఏది?
1) రంగరాజన్ కమిటీ
2) సుదర్శన్ సేన్ కమిటీ
3) రఘురాం రాజన్ కమిటీ
4) సుందరేశన్ కమిటీ

View Answer

స‌మాధానం: 2

7. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరు? 
1) నబమ్ టుకి
2) పెమా ఖండు
3) కలిఖో పుల్
4) జార్బామ్ గామ్లిన్

View Answer

స‌మాధానం: 2

8. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఫిరంగి (ATAGS) ఫైరింగ్ రేంజ్ ఎంత?
1) 10 కి.మీ.
2) 20 కి.మీ.
3) 30 కి.మీ.
4) 40 కి.మీ.

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డీఆర్‌డీవో 155 మి.మీ. ఫిరంగి వ్యవస్థ (ATAGS)ను అభివృద్ధి చేసింది. ATAGS: Advanced Towed Artillery Gun System

9. ‘ఫైడ్ ఉమన్స్ గ్రాండ్ ప్రి 2016’ చెస్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు?
1) ఓల్గా గిర్య
2) కోనేరు హంపి
3) ద్రోణవల్లి హారిక
4) సుసాన్ పోల్గర్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: చైనాలోని చెంగ్డూ నగరంలో జరిగిన ఫైడ్ ఉమన్స్ గ్రాండ్ ప్రి ట్రోఫీని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ద్రోణవల్లి హారిక కైవసం చేసుకుంది.

10. ‘Who Moved My Interest Rate?’ పుస్తక రచయిత ఎవరు?
1) రఘురాం రాజన్
2) రంగరాజన్
3) సుందర రాజన్
4) దువ్వూరి సుబ్బారావు

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: దువ్వూరి సుబ్బారావు 2008-13 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పనిచేశారు. ఈ కాలంలో తన అనుభవాలు.. తనపై అప్పటి ఆర్థిక మంత్రులు పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ ప్రభావం గురించి ఈ పుస్తకంలో వివరించారు.

11. ఇటీవల ఏ రాష్ట్రంలో ‘రామాయణ మాసం’ను ప్రారంభించారు?
1) కేరళ
2) ఉత్తర ప్రదేశ్
3) బీహార్
4) మధ్య ప్రదేశ్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: మలయాళ క్యాలెండర్‌లో చివరి నెలను ‘కర్కదాకం’ అంటారు. కేరళీయులు అనాది కాలంగా ఈ నెలలో రామాయణ పారాయణాన్ని సాంప్రదాయంగా నిర్వహిస్తున్నారు.

12. తాజాగా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదాను పొందిన భారత పురాతన కట్టడం ఏది?
1) నాగార్జున కొండ
2) నలందా విశ్వవిద్యాలయం
3) చార్మినార్
4) గోల్కొండ కోట

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: భారత్ నుంచి ఇప్పటి వరకు 33 ప్రాంతాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

13. మహాత్మ గాంధీ శిలా విగ్రహాన్ని భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు?
1) తైవాన్
2) చైనా
3) సింగపూర్
4) మంగోలియా

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లోని పెట్‌హబ్ ఆశ్రమంలో మహాత్మ గాంధీ విగ్రహాన్ని అన్సారి ఆవిష్కరించారు.

14. 11వ ఆసియా-యూరోప్ సమ్మిట్ ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ
2) బీజింగ్
3) ఉలాన్‌బాటర్
4) ఆస్తానా

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో జరిగిన 11వ ఆసియా-యూరోప్ సదస్సుకు భారత్ నుంచి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి హాజరయ్యారు. ఈ సమావేశానికి 51 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

15. ప్రపంచంలోనే మొదటి సంచార రైలు ఆసుపత్రి ‘లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది?
1) 25
2) 20
3) 15
4) 10

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ‘లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ (జీవన్ రేఖ ఎక్స్‌ప్రెస్) పేరుతో 25 సంవత్సరాల క్రితం సంచార రైలు ఆసుపత్రిని ‘ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్’ ప్రారంభించింది. ఆసుపత్రికి దూరంగా ఉన్న గ్రామాల్లో వైద్య సేవలు అందించడానికి ఈ ‘హాస్పిటల్ ట్రైన్’ సేవలను మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 18 రాష్ట్రాల్లో 2 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ రైలు 173 ఆరోగ్య ప్రాజెక్టులు నిర్వహించింది.

16. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్.. ఏ కంపెనీతో కలిసి భారత్‌లో హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించనుంది?
1) బోయింగ్
2) అగస్టా వెస్ట్‌ల్యాండ్
3) బెల్ హెలికాప్టర్
4) ఎయిర్‌బస్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: అమెరికాకు చెందిన బెల్ హెలికాప్టర్ సంస్థతో కలిసి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్.. పౌర, మిలటరీ అవసరాల కోసం హెలికాప్టర్లను తయారుచేయనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.

17. "Courage & Commitment: An Autobiography" పుస్తక రచయిత ఎవరు?
1) సయ్యద్ అహ్మద్
2) జోయా హసన్
3) నిహార్ ముఖర్జీ
4) మార్గరెట్ అల్వా

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: సీనియర్ రాజకీయవేత్త మార్గరెట్ అల్వా తన స్వీయ చరిత్రను ‘కరేజ్ అండ్ కమిట్‌మెంట్’ పేరుతో రచించారు. కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన అల్వా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గడిపారు. గుజరాత్, రాజస్థాన్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు.

18. భారత ఆటోమొబైల్ సంస్థ ‘అశోక్ లేలాండ్’ ఏ దేశంలో కొత్త అసెంబ్లింగ్ యూనిట్‌ను ప్రారంభించనుంది?
1) జింబాబ్వే
2) కెన్యా
3) నమీబియా
4) దక్షిణాఫ్రికా

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: భారత రెండో అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్.. కెన్యాలో బస్ అసెంబ్లింగ్ యూనిట్‌ను రూ. 70 కోట్ల వ్యయంతో ప్రారంభించనుంది. ఈ యూనిట్‌లో ఏటా 1200 బస్‌లను తయారుచేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

19. ‘ది గ్రేట్ ఇండియా రన్’ మారథాన్‌ను ఎక్కడ నుంచి ప్రారంభించారు?
1) ముంబై
2) కోల్‌కత్తా
3) న్యూఢిల్లీ
4) పట్నా

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ‘ది గ్రేట్ ఇండియా రన్’ పేరుతో దేశంలోనే తొలిసారిగా మల్టీసిటీ మారథాన్ న్యూఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి జూలై 17న ప్రారంభించారు. ఇది ఆగస్టు 4న ముంబైలో ముగుస్తుంది.

20. మనిషిలా నడవగలిగే రోబో ‘డురుస్ (DURUS)’ను ఏ దేశానికి చెందిన పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసింది?
1) అమెరికా
2) కెనడా
3) ఇజ్రాయెల్
4) ఇరాన్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: అమెరికాకు చెందిన పరిశోధనాభివృద్ధి సంస్థ ‘ఎస్‌ఆర్‌ఐ ఇంటర్నేషనల్’.. జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన అంబర్ ల్యాబ్‌తో కలసి డురుస్ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది.

21. డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుపొందిన బాక్సర్ ఎవరు?
1) కెర్రి హోప్
2) విజేందర్ సింగ్
3) జిమ్మీ యంగ్
4) మిగుయిల్ కొటో

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: న్యూఢిల్లీలో జరిగిన డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ ఫైట్‌లో ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్‌ను ఓడించి విజేందర్ సింగ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

22. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర హైకోర్టులో ఏకీకృత క్రిమినల్ న్యాయ వ్యవస్థ (Integrated Criminal Justice System)ను ప్రారంభించనున్నారు?
1) గోవా
2) తమిళనాడు
3) మహారాష్ట్ర
4) తెలంగాణ & ఏపీ

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఇటీవల ఈ-కోర్టును ఏర్పాటు చేశారు. ఇది దేశంలోని తొలి ఈ-కోర్టు. అలాగే ICJSను కూడా హైదరాబాద్ హైకోర్టులోనే తొలిసారిగా ఏర్పాటుచేయనున్నారు.

23. ఏ దేశ సహకారంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాల (Skill Development Centres)ను ఏర్పాటుచేయనుంది?
1) స్వీడన్
2) డెన్మార్క్
3) ఫిన్‌లాండ్
4) నెదర్లాండ్స్

View Answer

స‌మాధానం: 4

24. ‘అటల్ పెన్షన్ యోజన’కు కేంద్ర ప్రభుత్వం ఎంత మూలధనాన్ని సమకూర్చింది?
1) రూ. 100 కోట్లు
2) రూ. 80 కోట్లు
3) రూ. 70 కోట్లు
4) రూ. 49 కోట్లు

View Answer

స‌మాధానం: 1

25. ఈ ఏడాది భారత్ నుంచి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకున్న ప్రాంతాలేవి?
i) కాంచన జంగా నేషనల్ పార్క్
ii) నలందా మహావిహార
iii) ఛండీగఢ్ క్యాపిటల్ కాంప్లెక్స్
1) i మాత్రమే
2) i, ii
3) ii మాత్రమే
4) i, ii, iii

View Answer

స‌మాధానం: 4

26. ఉత్తర భారతదేశంలో తన ఖాతాదారులకు జీవిత బీమా సౌకర్యం కల్పించడానికి నైనిటాల్ బ్యాంక్ఏ ఇన్సూరెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది?
1) లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా
2) ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ
3) నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ
4) ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్

View Answer

స‌మాధానం: 4

27. అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) జూలై 18
2) జూలై 20
3) జూలై 22
4) జూలై 30

View Answer

స‌మాధానం: 1

28. రైళ్ల నిర్వహణ, భద్రత కోసం భారతీయ రైల్వే ప్రారంభించిన నూతన వ్యవస్థ ఏది?
1) సురక్ష మిత్ర
2) త్రినేత్ర
3) ఆదర్శ మిత్ర
4) సుబందు

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ప్రతికూల పరిస్థితుల్లో కూడా సురక్షితంగా రైళ్లను గమ్యస్థానాలకు చేర్చడానికి త్రినేత్ర వ్యవస్థ సహాయపడుతుంది. Tri-NETRA: Terrain Imaging for Diesel Drivers - Infrared Enhanced Optical and Radar Assisted

29. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ జల విద్యుత్ కేంద్రం నుంచి ఏ రాష్ట్రాలకు విద్యుత్‌ను అందించనున్నారు?
i) గుజరాత్
ii) మహారాష్ట్ర
iii) మధ్యప్రదేశ్
iv) పంజాబ్
1) i, ii
2) i, ii, iv
3) i, ii, iii
4) ii, iv

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ జల విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనిలో 57 శాతం మధ్యప్రదేశ్‌కి, 27 శాతం మహారాష్ట్రకు, 16 శాతం గుజరాత్‌కు కేటాయించారు.

30. ఆస్ట్రేలియా నూతన ప్రధాన మంత్రి ఎవరు?
1) జాన్ హోవర్డ్
2) విలియం మెక్‌మోహన్
3) మాల్కోమ్ టర్న్‌బుల్
4) టోనీ అబోట్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ఆస్ట్రేలియా 29వ ప్రధాన మంత్రిగా లిబరల్ పార్టీకి చెందిన మాల్కోమ్ టర్న్‌బుల్ ఎన్నికయ్యారు.

31. ‘యోగా, ఆయుర్వేదం’ ప్రచారం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) యునెస్కో
2) చైనా ఆరోగ్య శాఖ
3) ప్రపంచ ఆరోగ్య సంస్థ
4) బ్రిటన్ ఆరోగ్య శాఖ

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: యోగా, ఆయుర్వేదం, యునాని, పంచకర్మల ప్రచారం కోసం భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో ఒప్పందం చేసుకుంది.

32. దక్షిణాసియా డయాస్పొరా అవార్డు (South Asian Diaspora Award)ను తాజాగా ఎవరు అందుకున్నారు?
1) మహేంద్ర చౌదరి
2) కమల ప్రసాద్
3) శ్రీధరన్
4) ఎస్.ఆర్. నాథన్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: భారత సంతతికి చెందిన సింగపూర్ మాజీ అధ్యక్షుడు ఎస్.ఆర్. నాథన్.. దక్షిణాసియా డయాస్పొరా పురస్కారాన్ని అందుకున్నారు.

33. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ ఎవరు?
1) గురుప్రసాద్ మహాపాత్ర
2) సుధీర్ రహేజా
3) ఆర్.కె. శ్రీవాత్సవ
4) వి.పి. అగర్వాల్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: నేషనల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలను కలిపి 1995లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే నూతన సంస్థను ఏర్పాటుచేశారు. దీని కింద 125 అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి.

34. ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త (Chief Economist)గా ఎవరు నియమితులయ్యారు?
1) కౌశిక్ బసు
2) పాల్ రోమర్
3) విన్సెంట్ స్మిత్
4) పాల్ క్రుగ్‌మన్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్తగా కౌశిక్ బసు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో పాల్ రోమర్ నియమితులయ్యారు.

35. హిమాలయాలు ఏటా 5 నుంచి 20 మీటర్ల మేర కరుగుతున్నాయని ఏ సంస్థ నిర్వహించిన సర్వే తెలుపుతోంది?
1) ఇస్రో
2) నాసా
3) యురోపియన్ స్పేస్ ఏజెన్సీ
4) జపనీస్ స్పేస్ ఏజెన్సీ

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఇస్రో, వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం భూతాపం వల్ల హిమాలయాల్లోని హిమనీనదాలు ఏటా 5 నుంచి 20 మీటర్ల మేర కరుగుతున్నాయి.

36. ప్రపంచ ఎలక్ట్రికల్ కొనుగోలుదారుల సదస్సు (World Electrical Buyers Summit)ను ఎక్కడ నిర్వహించనున్నారు?
1) చెన్నై
2) బెంగళూరు
3) నాసిక్
4) వడోదర

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ‘స్విచ్ గ్లోబల్ ఎక్స్‌పో’ పేరుతో ప్రపంచ ఎలక్ట్రికల్ కొనుగోలుదారుల సదస్సును గుజరాత్‌లోని వడోదరలో అక్టోబర్‌లో నిర్వహించనున్నారు.

37. ‘తీస్తా లో డ్యామ్’ జల విద్యుత్ కేంద్రం నాలుగో దశ (Teesta Low Dam Hydroelectric Project Stage IV)ను పూర్తిచేసిన కంపెనీ ఏది?
1) ర్యాన్స్ పవర్
2) అదాని పవర్
3) బీహెచ్‌ఈఎల్
4) బీఈఎల్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ‘తీస్తా లో డ్యామ్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ స్టేజ్ IV’ డార్జిలింగ్‌లో ఉంది. తీస్తా ప్రాజెక్టును నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ (NHEPC) ఏర్పాటుచేసింది. ఈ ప్రాజెక్టు 4వ దశను బీహెచ్‌ఈఎల్ పూర్తిచేసింది.

38. ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశ శాస్త్రవేత్తలు జికా వైరస్ నిర్మూలనకు వ్యాక్సిన్‌ను తయారుచేశారు?
1) అమెరికా
2) కెనడా
3) ఆస్ట్రేలియా
4) బ్రెజిల్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: కెనడాలోని క్యూబెక్ నగరంలో ఉన్న లావల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జికా వైరస్ నిర్మూలనకు వ్యాక్సిన్‌ను తయారుచేశారు. దీన్ని మానవులపై పరీక్షించనున్నారు.

39. కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ మోటార్స్ రూ. 1300 కోట్ల పెట్టుబడితో ప్రపంచ వ్యాపార కేంద్రాన్ని భారత్‌లో ఎక్కడ ఏర్పాటు చేయనుంది?
1) హైదరాబాద్
2) పుణే
3) చెన్నై
4) గుర్గావ్

View Answer

స‌మాధానం: 3

40. ప్రతిష్టాత్మక బీబీసీ ‘కోమ్ల డుమోర్ అవార్డ్ - 2016’ను ఎవరు అందుకున్నారు?
1) అమృతా రాయ్
2) బార్బరా వాల్టర్స్
3) జూలియన్ అసాంజె
4) దిది అకిన్యెలురె

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: 2014లో కన్నమూసిన బీబీసీ వరల్డ్ న్యూస్ జర్నలిస్టు కోమ్ల డుమోర్ గౌరవార్థం ఆ సంస్థ 2015 నుంచి ‘కోమ్ల డుమోర్ అవార్డ్’ను అందజేస్తుంది. తొలి అవార్డును కెన్యాకు చెందిన న్యూస్ యాంకర్ నాన్సి కకుంగిరా అందుకోగా.. రెండో పురస్కారాన్ని నైజీరియాకు చెందిన దిది అకిన్యెలురె స్వీకరించారు.

41. ‘గూగుల్ కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డు’కు ఎంపికైన ఆసియా వాసి ఎవరు?
1) అడ్వాయ్ రమేష్
2) యాంగ్ చాంగ్ లీ
3) సుందర రాజన్
4) మహమ్మద్ అస్లాం ఖాన్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: వాతావరణం, ఆరోగ్య రంగాల్లో నూతన ఆవిష్కరణలు చేసినవారిని గౌరవించడానికి గూగుల్ సంస్థ కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డును ఏర్పాటుచేసింది. చెన్నైకి చెందిన 14 ఏళ్ల అడ్వాయ్ రమేష్ తయారుచేసిన పరికరం జాలర్ల భద్రత, ఉత్పాదకత అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ అవార్డు కింద 50 వేల డాలర్ల ఉపకారవేతనం అందుతుంది.

42. మిస్టర్ వరల్డ్ - 2016 టైటిల్ విజేత ఎవరు?
1) ఫెర్నాండో అల్వరెజ్
2) ఆల్డో రమీరెజ్
3) రోహిత్ ఖండేల్వాల్
4) ఓల్గె జస్టస్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా రోహిత్ చరిత్రకెక్కారు.

43. నూతనంగా నిర్మించనున్న ఘాటమ్‌పూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1) హరియాణా
2) ఉత్తర ప్రదేశ్
3) మధ్య ప్రదేశ్
4) కర్ణాటక

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: రూ. 17,238 కోట్లతో ఘాటమ్‌పూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి 1980 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

44. ‘ఆపరేషన్ ముస్కాన్’ లక్ష్యమేమిటి?
1) తప్పిపోయిన పిల్లల్ని వెతికి తల్లిదండ్రులకు అప్పగించడం
2) హిందువుల మత మార్పిడిని నిరోధించడం
3) కశ్మీర్ లోయలో అల్లర్లను నిర్మూలించడం
4) అన్మేముడి పర్వతాన్ని శుభ్రపరచడం

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఇప్పటి వరకు ఆపరేషన్ ముస్కాన్ ద్వారా తప్పిపోయిన 4386 పిల్లల్ని కాపాడి, వారి కుటుంబాలకు అప్పగించారు.

45. ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నదేది?
1) ఎక్సాన్
2) ఆపిల్
3) బెర్క్‌షైర్ హాత్‌వే
4) వాల్‌మార్ట్

View Answer

స‌మాధానం: 4

46. ఫార్చ్యూన్ విడుదల చేసిన 500 కంపెనీల జాబితాలో భారత్ నుంచి అత్యుత్తమ కంపెనీ ఏది?
1) రిలయన్స్
2) భారత్ పెట్రోలియం
3) ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్
4) స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో భారత్ నుంచి ఏడు కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. అవి.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (161), రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (215), టాటా మోటార్స్ (226), ఎస్బీఐ (232), భారత్ పెట్రోలియం (358), హిందుస్థాన్ పెట్రోలియం (367), రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ (423).

47. క్వాక్వరెల్లి సైమండ్స్ (Quacquarelli Symonds) విడుదల చేసిన ఆసియాలో ఉత్తమ యూనివర్సిటీల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది ఏది?
1) ఐఐఎస్‌సీ బెంగళూరు
2) నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్
3) యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్
4) నాన్‌యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ఆసియాలోని ఉత్తమ యూనివర్సిటీల జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) 33వ స్థానంలో ఉంది.

48. ‘వైకింగ్ 1 (Viking 1)’ అంతరిక్ష నౌకను నాసా అంగారక గ్రహం మీదకు పంపి ఎన్ని సంవత్సరాలు గడిచింది?
1) 40
2) 30
3) 20
4) 10

View Answer

స‌మాధానం: 1

49. ఇటీవల ఏ రాష్ట్రంలో 15 సంవత్సరాలు వాడిన పెట్రోల్, 10 సంవత్సరాలు పూర్తిచేసుకున్న డీజిల్ వాహనాలపై నిషేదం విధించారు?
1) ఉత్తర ప్రదేశ్
2) మధ్య ప్రదేశ్
3) హరియాణా
4) ఒడిశా

View Answer

స‌మాధానం: 3

50. ప్రతిష్టాత్మక పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ (PATA) అవార్డుకు ఎంపికైన పర్యాటక సంస్థ ఏది?
1) కేరళ టూరిజం
2) సింగపూర్ టూరిజం
3) మలేషియా టూరిజం
4) మధ్య ప్రదేశ్ టూరిజం

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: కేరళ రాష్ట్ర టూరిజం శాఖతో పాటు ఈ-న్యూస్ లెటర్ అనే కార్యక్రమం బంగారు పతకాల్ని సాధించాయి.⁠⁠⁠⁠
1. ఇటీవల UIDAI కి సీఈవోగా నియమితులైంది ఎవరు?
1) అజయ్ భూషణ్ పాండే
2) విజయ వర్ధన్
3) విజయ్ బహుగుణ
4) శ్రీ ప్రశాంత్ శర్మ

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: 1984 మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన అజయ్ భూషణ్ పాండే UIDAI ఆధార్‌కు చెర్మన్‌గా నియమితులయ్యారు.

2. అక్విల (Aqulia) అనే సోలార్ ప్లేన్‌ను ప్రారంభించిన సంస్థ ఏది?
1) గూగుల్
2) టిట్వర్
3) ఫేస్‌బుక్
4) అమెజాన్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: మారుమూల గ్రామాలకు ఇంటర్నేట్ సేవలు అందించటానికి ఫేస్‌బుక్ మొదటి సోలార్ ప్లేన్‌ను ప్రారంభించింది. ఇదిమూడు నెలల వరకు ఆకాశంలో 18,290 మీటర్లు తిరుగుతూ ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది.

3. ‘తమిళ కవి తిరువాళ్వర్’ విగ్రహాం ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయడం వల్ల వివాదం ప్రారంభమైంది?
1) కాశీ
2) రుషికేశ్
3) దేవ ప్రయాగ
4) హరిద్వార్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: బీజేపీరాజ్య సభ ఎంపీ తరుణ్ విజయ్ హరిద్వార్‌లో తమిళకవి తిరువాళ్వర్ విగ్రహాం పెట్టాలని ప్రతిపాదించారు. దీనిని స్థానిక బ్రాహ్మణ పండితులు వ్యతిరేకించారు.

4. 11 రోజుల్లో భూమి చుట్టూతిరిగివచ్చి రికార్డు సృష్టించినది ఎవరు?
1) మాజిలాన్
2) ఫెడోర్ కోన్యుఖోవ్
3) విక్టర్ డే
4) అలిసాముర్రే

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: రష్యాకు చెందిన సాహస వీరుడు ఫెడోర్ కోన్యుఖోవ్ (Fedor Konyukhov) 11 రోజుల్లో హట్ ఎయిర్ బెలూన్‌లో భూమి చుట్టూ తిరిగి పశ్చిమ ఆస్ట్రేలియాలో దిగాడు. ఇతడు 34,000 కి.మీ. దూరాన్ని అత్యంత వేగంగా తిరిగి వచ్చి రికార్డు సృష్టించాడు.

5. ఇటీవల "IRCTC" ఈ - టికెటింగ్ విధానం అభివృద్ధి, ప్రచారం కోసం ఏ ఆర్థిక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? 
1)ఐసీఐసీఐ
2) యాక్సిస్ బ్యాంక్
3) విజయ బ్యాంక్
4)ఎస్‌బీఐ

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఆన్ రిజర్వ్‌డ్, ఈ-టికెటింగ్ విధానం గురించి ప్రచారం, బుకింగ్ అభివృద్ధి కోసం ఈ ఒప్పందం జరిగింది. దీని ద్వారా ప్రయాణికుడు ఎక్కడ నుంచైనా ఆన్‌రిజర్వ్‌డ్ టికెట్ కొనుగోలు చేయవచ్చు.

6. ‘రిలయన్స్ జియోమనీ’(JioMoney) తన ఆర్థిక లావాదే వీల కోసం ఏ ఆర్థిక సంస్థతో ఒప్పందం చేసుకుంది?
1) ఫెడరల్ బ్యాంక్
2) కార్పోరేషన్ బ్యాంక్
3) కరూర్ వైశ్య బ్యాంక్
4) కర్ణాటక బ్యాంక్

View Answer

స‌మాధానం: 1

7. ఇటీవల రిజ్వర్ బ్యాంక్ ‘‘ఆర్థిక అక్షరాస్యత క్యాంప్’’ ఎక్కడ నిర్వహించింది?
1) ప్రయాగ
2) రామేశ్వరం
3) పూరి
4) బరంపురం

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: పూరిలో జగన్నాధ రథయాత్రను పురసర్కించుకొని ఆర్‌బీఐ‘ఆర్థిక అక్షరాస్యత క్యాంప్‌ను’ ప్రారంభించింది.

8. భారతదేశం బయట డబుల్ సెంచరీ చేసిన మొదటి భారతీయ క్రికెట్ కెప్టెన్ ఎవరు?
1) ఎమ్.ఎస్. ధోని
2) సచిన్ టెండూల్కర్
3) విరాట్ కోహ్లి
4) అజారుద్దీన్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 200 పరుగులు సాధించాడు.

9. భారతదేశంలో మొదటిసారిగా ఏ ప్రాంతంలో ‘వాటర్ మెట్రోప్రాజెక్ట్’ ను ప్రారంభించారు?
1) గజ్వేల్
2) కొచ్చి
3) కుప్పం
4) అన్నానగర్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: జర్మనీ సహకారంతో మొదటిసారిగా వాటర్ మెట్రోప్రాజెక్టును కేరళలోని కొచ్చిలో ప్రారంభించారు.

10. తాజా నివేదిక ప్రకారం భారత్‌లోని పట్టణాల్లో ఇంటర్నెట్ వాడకంఅత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
1) తమిళనాడు
2) మహారాష్ట్ర
3) ఢిల్లీ
4) కర్ణాటక

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: మార్చి 2016 నాటికి పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అధికంగా వాడుతున్న రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రంలో 21 మిలియన్ ప్రజలు పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడుతున్నారు. దీని తర్వాత స్థానంలో మహారాష్ట్ర, ఢిల్లీ (19 మిలియన్‌లు) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. దేశం మొత్తం మీద 231 మిలియన్ మంది పట్టణాల్లో ఇంటర్నెట్ వాడుతున్నారు.

11. గ్రామీణ‌ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) ఆంధ్రప్రదేశ్
3) కర్నాటక
4) ఉత్తరప్రదేశ్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: దేశంలో 112 మిలియన్ల ప్రజలు గ్రామాల్లో ఇంటర్నెట్ వాడుతున్నారు. ఉత్తరప్రదేశ్ 11.2 మిలియన్లతో మొదటిస్థానంలో ఉంది. తర్వాత స్థానంలో వరుసగా మహారాష్ట్ర 9.7 మిలియన్లు, ఆంధ్రప్రదేశ్ 9 మిలియన్ల ఉన్నాయి.

12. ఏ ఆర్థిక సంస్థ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో MSME టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించారు?
1) యుఎన్‌ఓ
2) బ్రిక్స్ బ్యాంక్
3) ప్రపంచ బ్యాంక్
4) ఆసియా అభివృద్ధి బ్యాంక్

View Answer

స‌మాధానం: 3

13. గంగానది ప్రక్షాళన కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది?
1) మాధవ్ చితాలే కమిటీ
2) మాధవ్ గాడ్గిల్ కమిటీ
3) బహుగుణ కమిటీ
4) సుందర రాజన్ కమిటీ

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: గంగానది ప్రక్షాళనకు సూచనలు ఇవ్వడం కోసం కేంద్ర జలవనరుల నిర్వహణ శాఖమాధవ్ చితాలే (Madhav Chitale) కమిటీనిఏర్పాటు చేసింది. కమిటీ కాల పరిమితి మూడు నెలలు.

14. ‘మహనాయక్ సమ్మాన్ 2016’ ఉత్తమ డెరైక్టర్ పురస్కారానికి ఎంపికైనది ఎవరు?
1) పా.రంజిత్
2) కౌశిక్ గంగూలీ
3) రాజమౌళి
4) దాసరి నారాయణరావు

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బెంగాల్ నటుడు ‘ఉత్తమ్ కుమార్’ గౌరవార్థం 2012 సంవత్సరంలో‘మహనాయక్ సమ్మాన్’ పురస్కారాలు ప్రారంభించింది.
ఉత్తమ దర్శకుడు: కౌశిక్ గంగూలీ మరియు గౌతమ్ ఘోష్‌కు
ఉత్తమ గాయకుడు: బప్పిలహిరి
ఉత్తమ నటులు: జీశుసేన్ గుప్తా మరియు పారాన్ బందోపాధ్యాయ్

15. ఇటీవల CMERI సంస్థ ఎంత పెట్టుబడితో సోలార్ పవర్ చెట్లు ఏర్పాటు చేసింది?
1) రూ. 1 లక్ష
2) రూ.2 లక్షలు
3)రూ.3 లక్షలు
4) రూ.5 లక్షలు

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సోలార్ పవర్ చెట్లను అభివృద్ధి చేసింది. 5 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా 5 లక్షల వ్యయంతో సోలార్ పవర్ చెట్లను ఏర్పాటు చేస్తున్నారు.

16. ఇటీవల జావెలిన్‌తో U-20 విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఎవరు?
1) నీరజ్ చోప్రా
2) టామ్ పెట్రాంఫ్
3) సోని నిక్సెన్
4) ఎరిక్ లేమింగ్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: U- 20 జావెలిన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 86.48 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి నీరజ్ చోప్రా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

17. దేశంలోనే మొదటి సారిగా గ్రీన్ రైల్వే కారిడార్‌ను ఏ ప్రాంతాల మధ్య ప్రారంభించారు?
1) సేలం - కోయం బత్తూరు
2) పూనే - థానే
3) అలహాబాద్ - కాన్పుర్
4) రామేశ్వరం - మనమధురై

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: రామేశ్వరం నుంచి మనమధురైకు (Manamadurai–Rameswaram)ప్రయాణికులకు శుభ్రమైన, ఆరోగ్యకరమైన పరిస్థితులు కల్పించేందుకు గ్రీన్‌రైల్వే కారిడార్‌ను కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు.

18. ఇటీవల హిందుజా జాతీయ పవర్ కమిషన్ ఎక్కడ ప్రారంభించారు?
1) కొచ్చిన్
2) విశాఖ పట్నం
3) కోవ్వాడ
4) మంగుళూరు

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: 50 మెగావాట్‌ల సామర్థ్యం గల రెండు పవర్ ప్రాజెక్టులను విశాఖపట్నంలో హిందూజా నేషనల్ పవర్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ అవసరాలకు వినియోగిస్తారు.

19. నాస్కోమ్ విడుదల చేసిన ఐటి-బిజినెస్ ప్రాసెస్ మెనెజ్‌మెంట్ ఉద్యోగుల జాబితా 2016లో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది?
1) ఇన్ఫోసిస్
2) టీసీఎస్
3) కాగ్ని జెంట్
4) విప్రో లిమిటెడ్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: నాస్కోమ్ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక ఉద్యోగుల ఉన్న ఐటి సంస్థ టీసీఎస్.ఈ సంస్థకు 3,62,079 మంది ఉద్యోగులు ఉన్నారు. 1,47,050 మందితో రెండోస్థానంలో ఇన్ఫోసిస్ ఉంది.

20. ప్రతిష్టాత్మక కళానిధి పురస్కారం పొందిన మొదటి మహిళ వయోలినిస్ట్ ఎవరు?
1) లలితా సుబ్రమణ్యం
2) ఎమ్. నర్మద
3) నందిని ముత్తస్వామి
4) కన్యాకుమారి

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ప్రతిష్టాత్మక సంగీత కళానిధి పురస్కారం పొందిన మొదటి మహిళ వయోలినిస్ట్ కన్యాకూమారి. సంగీత కళ ఆచార్య పురస్కారానికి ఆర్.ఎన్. త్యాగరాజన్, ఆర్.ఎన్.తారనాథ న్, కె. వెంకట్రామన్ ఎంపికయ్యారు.

21. జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో కాంస్య పతకం సాధించినది ఎవరు?
1) మానవాదిత్య రాథోడ్
2) అనంత్ రెడ్డి
3) షాపత్ భరద్వాజ్
4) సంజయ్ థామస్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఏథెన్స్ ఒలంపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కూమారుడు మానవాదిత్య రాథోడ్ ఇటలీలో జరిగిన జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో కాంస్య పతకం సాధించాడు.

22. ప్రతిష్టాత్మక హంగేరియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములావన్ విజేత ఎవరు?
1) డేనియల్ రిక్కిర్డో
2) నికోరోస్‌బర్గ్
3) లేవిస్ హామిల్టన్
4) మాక్స్ వెటర్సన్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: హంగేరియన్ గ్రాండ్ ప్రీ లో మెర్సిడెస్ డ్రైవర్ లేవిస్ హమిల్టన్ విజయం సాధించాడు. రెండో స్థానంలో నికోరోస్‌బర్గ్, మూడో స్థానంలో డేనియల్ రికి ర్డొ నిలచారు.

23. భారత వ్యవసాయ మంత్రిత్వశాఖ, ఏ సంస్థ/శాఖతో కలిసి ‘‘భవిష్యత్తు కోసం ఆహారం’’ అనే పథకంను ప్రారంభించింది?
1) ప్రపంచ ఆహార సంస్థ
2) యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషన్ డెవలప్‌మెంట్
3) చైనా వ్యవసాయ శాఖ
4) కెనడా వ్యవసాయ శాఖ

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ఈ పథకం కింద ఆసియా, ఆఫ్రికాకు చెందిన 1500 మంది నిపుణులకు రైతుల సమస్యల నిర్మూలన కోసం వినూత్న పరిష్కారాలు అందించేలాశిక్షణ ఇస్తారు.

24. కాశ్మీర్ లోయలో పెల్లెట్ గన్ వాడకం మీద వేసిన కమిటీ ఏది?
1) ఆర్.ఎమ్. లోధా కమిటీ
2) టీ.వీ.ఎస్.ఎన్.పసాద్ కమిటీ
3) ఆర్‌ఆర్ మిశ్రా కమిటీ
4) జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: పెల్లెట్, బుల్లెట్‌లు శరీరానికి తాకడం వల్ల ప్రాణాంతకం కాని అనేక గాయాలు అవుతాయి. పెల్లెట్‌లు కంటిలో కుచ్చుకున్నప్పుడు చూపు పోయే అవకాశం ఉంది. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ 7 మంది సభ్యులతో టీ.వీ.ఎస్.ఎన్.పసాద్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.

25. లైంగిక దోపిడీ, నిందల బారిన పడిన వారిని రక్షించేందుకు ప్రపంచ శాంతి నిధికి ఇండియా ఎంత ఆర్థిక సహాయం చేసింది?
1) 10 వేల డాలర్లు
2) 30 వేల డాలర్లు
3) 50 వేల డాలర్లు
4) 1 లక్ష డాలర్లు

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి 16 శాంతి పరిరక్షణ ఆపరేషన్‌లు చేస్తుంది.

26. మొబైల్ నంబర్ ఆధారంగా తక్షణం నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్థిక సంస్థ ఏది?
1) ఎస్‌బీఐ
బి ఐసీఐసీఐ
3) విజయా బ్యాంక్
4) కర్ణాటక బ్యాంక్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఎస్‌బీఐ బ్యాంక్ డెబిట్ కార్డు లేకుండా, బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానించిన ఫోన్ నంబర్ ద్వారా నగదు బదిలీ సౌకర్యాన్ని కల్పించింది.

27. ఆసియా ఖండంలో జీవించే ఏనుగుల సగటు జీవితకాలం ఎంత?
1) 30 సంవత్సరాలు
2) 48 సంవత్సరాలు
3) 60 సంవత్సరాలు
4) 70 సంవత్సరాలు

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ఆసియా ఖండంలో ఏనుగుల సగటు జీవిత కాలం 48 సంవత్సరాలు. ఆఫ్రికా ఏనుగుల జీవిత కాలం 60-70 సంవత్సరాలు. 2003లో 85సం॥వయస్సుగల ఏనుగు తైవాన్‌లో మరణించింది. ప్రస్తుతం బతికి ఉన్న అతి వృద్ధ ఏనుగు ట్రావెన్‌కొర్ దేవస్థానంలో ఉన్న దాక్షాయని (86 సంవత్సరాలు).

28. ఆన్‌లైన్ ఫ్యాషన్ మార్కెట్ ‘జబాంగ్’ ను ‘మింత్ర’ ఎంతకు కొనుగోలు చేసింది?
1) 10 కోట్లు
2) 30 కోట్లు
3) 70 మిలియన్ డాలర్లు
4) 100 మిలియన్ డాలర్లు

View Answer

స‌మాధానం: 3

29. బ్రెజిల్ శాస్త్రవేత్తలు ఏ దోమల ద్వారా కూడా జికా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిరూపించారు ?
1) క్యులెక్స్
2) లూసియా
3) ఎనాఫిలిస్
4) కిమియా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఆడ క్యులెక్స్ దోమలు కూడా జికా వైరస్‌ను వ్యాపింపచేస్తాయని బెజిల్ శాస్త్రవేత్తలు నిరూపించారు.

30. ‘ కార్గిల్ దివస్’ ను ఏ రోజున జరుపుకుంటారు?
1) జూలై 15
2) జూలై 20
3) జూలై 23
4) జూలై 26

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో జూలై 26న భారత్‌కు విజయం లభించింది. దీనిని పురస్కరించుకొని కార్గిల్ దివస్‌ను జరుపుకుంటున్నాం.

31. ప్రపంచంలో అతి పెద్ద ‘యజిది’ (Yazidi) దేవాలయంను ఎక్కడ నిర్మిస్తున్నారు?
1) ఆర్మేనియా
2) ఇరాన్
3) సిరియా
4) ఇరాక్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: యజిదిలు జోరాస్ట్రియన్ మతమును అనుసరించే అతి పురాతన పర్షియా తెగ ప్రజలు. ఆర్మేనియాలో అక్నలీచ్ అనే గ్రామంలో ప్రపంచంలో అతి పెద్ధ యజిది దేవాలయ నిర్మాణం ప్రారంభించారు. ఆర్మేనియా దేశంలో 35,000 జనాభాతో అతి పెద్ద మైనారిటీ వర్గంగా యజిదీలున్నారు.

32. ఇటీవల ఏ ప్రాంతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహంను కేంద్ర రక్షణ శాఖ ప్రతిష్టించింది?
1) రాష్ట్రపతి భవన్
2) పార్లమెంట్
3) రామేశ్వరం
4) శ్రీహరి కోట

View Answer

స‌మాధానం: 3

33. ప్రపంచ హైపటైటిస్ దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
1) జూలై 28
2) జూలై 29
3) జూలై 30
4) జూలై 31

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: హైపటైటిస్ వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్స గురించి ప్రజల్లో అవగాహన కల్పించటం కోసం ఈ దినంను ప్రారంభించారు. ‘‘హైపటైటిస్‌ను నిరోధించటం మీకే వదిలేస్తున్నాం’’ అనే నినాదంతో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు.

34. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) జూలై 29
2) జూలై 20
3) జూలై 25
4) జూలై 28

View Answer

స‌మాధానం: 4

35. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఏ దేశాన్ని మీజిల్స్ (తట్టు) రహిత దేశంగా ప్రకటించింది?
1) ఘనా
2) పెరూ
3) నమీబియా
4) బ్రెజిల్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ బ్రెజిల్ దేశాన్ని మీజిల్స్ రహిత దేశంగా ప్రకటించింది.మీజిల్స్ లేదా రూబెల్లా వ్యాధి సోకిన 10 రోజుల్లో చర్మం మీద ఎర్రని మచ్చలు వస్తాయి.

36. అంతర్జాతీయ పులులు దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1) జూలై 27
2) జూలై 19
3) జూలై 22
4) జూలై 29

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: 2010 సెయింట్ పీటర్స్ బర్గ్‌లో పులుల గురించి జరిగిన సమావేశంలో మొదటిసారిగా పులుల దినోత్సవం జరుపుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో 2022 లోపు పులుల సంఖ్య రెండితలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

37. ప్రపంచంలో అతి ఎక్కువ పులులు ఉన్న దేశం ఏది?
1) ఇండోనేషియా
2) మలేషియా
3) ఇండియా
4) రష్యా

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ప్రపంచంలో అతి ఎక్కువగా పులులు ఇండియా (2,226) లో ఉన్నాయి. రెండో స్థానం రష్యా (433), మూడో స్థానం ఇండోనేషియా (371), నాలుగో స్థానంలో మలేషియా (250) ఉన్నాయి.

38. ప్రపంచ మానవుల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1) జూలై 25
2) జూలై 30
3) ఆగస్టు 1
4) ఆగస్టు 5

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ప్రజల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రభుత్వంతో కలిసి పని చేసే విధంగా కృషి చేయడం కోసం ఈ దినోత్సవంను జరుపుకుంటారు.

39. ప్రపంచంలో ఉత్తమ ప్రభుత్వ సంస్థల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది?
1) సీఎస్‌ఐఆర్
2) నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రిసెర్చ్ (ఫ్రాన్స్)
3) చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్
4) అమెరికన్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు చేస్తున్న ఉత్తమ ప్రభుత్వ సంస్థల జాబితాను స్చిమగో సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రిసెర్చ్ ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ ఉంది. ఈ జాబితాలో సీఎస్‌ఐఆర్(ఇండియా) 12వ స్థానంలో ఉంది.

40. ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె పురస్కారం 2016 కు భారత్ నుంచి ఎవరు ఎంపికయ్యారు?
1) బెజవాడ విల్సన్
2) టి.ఎమ్.కృష్ణ
3) ఎ, బి
4) చోచింటా కార్పవో

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: భారత్ నుంచి 2016లో రామన్ మెగసెసె పురస్కారం బెజవాడ విల్సన్, టి.ఎమ్. కృష్ణలకు లభించింది. బెజవాడ విల్సన్ మనుషుల ద్వారా టాయిలెట్స్, మురికి కాలువల శుద్ధి చేయించడానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. టి.ఎమ్. కృష్ణ కర్నాటక సంగీతంలో కళాకారుడు.

41. ప్రతిష్టాత్మక ‘భారత గౌరవ్’ పురస్కారం 2016 కు ఎవరు ఎంపికయ్యారు?
1) మిల్కాసింగ్
2) అర్జున్ దేవ్
3) సచిన్ టెండూల్కర్
4) రాహుల్ ద్రవిడ్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఈస్ట్ బెంగాల్ సిటీ పుట్‌బాల్ క్లబ్ ఈ బహుమతిని ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తుంది. భారత్ గౌరవ్ పురస్కారం పొందిన వారికి 2 లక్షల రూపాయలు నగదు బహుమతిగా లభిస్తుంది.

42. నాసా, భూమికి అతి దగ్గరగా ఉన్న ఏ ఆస్టరాయిడ్ మీదకు అంతరిక్ష వాహనం (స్పేస్ షటిల్) పంపించనుంది?
1) అమోర్
2) ఆటెన్స్
3) బెన్ను
4) అత్రిరాస్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: 2016 సెప్టెంబర్‌లో ‘బెన్ను’ అనే ఆస్టరాయిడ్ మీదకు నాసా అంతరిక్ష వాహనం పంపిచనుంది.

43. ఐసీసీ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు సంపాదించుకొన్న మొదటి శ్రీలంక క్రికెటర్ ఎవరు?
1) అర్జున రణతుంగ
2) ముత్తయ్య మురళీధరన్
3) జయసూర్య
4) జయవర్ధనే

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ముత్తయ్య మురళీధరన్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ఆర్ధర్ మోరిస్ కరెన్ రొల్డ్‌న్, ఇంగ్లాండ్‌కు చెందిన జార్జ్ లోహమన్ కూడా ఐసీసీ హల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించుకున్నారు.

44. ఇటీవల ఇండియా, రైల్వేల అభివృద్ధి కోసం ఏ దేశానికి 318 మిలియన్ డాలర్లు రుణం జారీ చేసింది?
1) భూటాన్
2) మయన్మార్
3) ఆప్ఘనిస్థాన్
4) శ్రీలంక

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: శ్రీలంకలో రైల్వే అభివృద్ధి కోసం 318 మిలియన్ డాలర్లు రుణంను ఇండియా జారీ చేసింది. ఈ రుణంను శ్రీలంక 20 సం॥తిరిగి చెల్లిస్తుంది.

45. ‘ఇండియా మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్’ అనే పుస్తక రచయిత ఎవరు?
1) ప్రేమ్ అహ్లువాలియా
2) మాటెంగ్ సింగ్ అహ్లువాలియా
3) నిరుపేంద్ర మిశ్రా
4) కె.సి. ఆజిత్ దోవల్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: రాష్ట్రపతి భవ న్‌లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పుస్తకంను ఆవిష్కరించారు. ప్రేమ్ అహ్లవాలియా ఈ పుస్తకంలో భారతదేశ నిర్మాణంలో స్త్రీ ప్రాత గురించి వివరించింది.

46. ప్రతిష్టాత్మక ‘నవలేఖన్’ పురస్కార గ్రహీత ఎవరు?
1) ఎ.తివారీ
2) బలరామ్ కవాంత్
3) ఓం నాగర్
4) పైవన్నీ

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: స్థానిక భాషలో ఉత్తమ రచనలు చేసిన వారిని గుర్తించి గౌరవించేందుకు భారతీయ జ్ఞానపీఠ్ ఏర్పాటు చేసిన పురస్కారమే ‘నవలేఖన్’. ఈ పురస్కారం కింద రూ.50,000 నగదు, ప్రశంసాపత్రం, వాగ్ధేవి కంచు విగ్రహం ప్రదానం చేస్తారు.

47. జాతీయ టూరిజం పురస్కారం 2014-2015లో ‘ఉత్తమ వారసత్వ నగరం’గా ఎంపికైన ప్రాంతం ఏది?
1) జైపూర్
2) భోపాల్
3) వరంగల్
4) ఫతెపూర్ సిక్రి

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: వరంగల్‌కి ఈ పురస్కారం రావడం వరుసగా ఇది మూడోసారి.⁠⁠⁠⁠

No comments:

Post a Comment