Sunday, September 18, 2016

భారత్‌కు దక్కని ‘ప్రత్యేక’ హోదా

‘ప్రపంచ వ్యూహాత్మక, రక్షణ భాగస్వామి’గా భారత్‌కు ప్రత్యేక హోదా కల్పించడంలో అమెరికా సెనేట్‌ విఫలమైంది. ఈ మేరకు ఎగుమతి నియంత్రణ క్రమబద్ధీకరణల్లో మార్పులు చేసేందుకు అవసరమైన సవరణ సెనేట్‌లో ఆమోదం పొందలేదు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడి అమెరికా చట్టసభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాతి రోజు... ‘జాతీయ రక్షణ ప్రాధికార చట్టం-2017 కు ప్రముఖ రిపబ్లికన్‌ సెనేటర్‌ జాన్‌ మెక్‌కెయిన్‌ సదరు సవరణను ప్రవేశపెట్టారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో మోడి చర్చల అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలో... భారత్‌ను ‘ప్రధాన రక్షణ భాగస్వామి’గా అమెరికా గుర్తించింది.

No comments:

Post a Comment