Sunday, September 18, 2016

పోషకాహార లోపం గల దేశాల్లో భారత్‌కు 114వ స్థానం

ప్రపంచ పోషకాహార నివేదిక ప్రకారం పోషకాహార లోపంతో ఎదుగుదల మందగించిన పిల్లల సంఖ్య భారత్‌లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 132 దేశాల్లో సర్వే నిర్వహించగా భారత్‌ ర్యాంకు 114గా ఉందని తేలింది. వెనుకబడిన ఆఫ్రికా దేశాలతో పోల్చినా భారత్‌లో పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. దేశంలో 38.7 శాతం పిల్లల పెరుగుదల లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడ్కెంది. చైనా ర్యాంకు 26, ఘనా ర్యాంకు 52, టోగో ర్యాంకు 80గా ఉంది. ప్రస్తుత పరిస్థితే కొనసాగితే ఘనా, టోగోను చేరుకోవడానికి 15 ఏళ్లు, చైనాను అందుకోవడానికి 40 ఏళ్లు పడుతుందని నివేదిక వెల్లడించింది. భారత్‌లో ఉన్న పెద్దవాళ్లలో 9.5 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారని ఈ విషయంలో 190 దేశాల్లో భారత్‌ ర్యాంకు 104గా ఉందని నివేదిక పేర్కొంది. 

No comments:

Post a Comment