Friday, September 16, 2016

మంచు తుపాను వల్ల 12 అమెరికా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి

2016 జనవరిలో మంచు తుపాను బారినపడ్డ అమెరికాలోని 12 రాష్ట్రాల పరిధిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.టెన్సిసీ, జార్జియా, కెంటకీ, నార్త్‌ కరోలినా, న్యూజెర్సీ, వర్జీనియా, వెస్ట్‌ వర్జీనియా, మేరీ ల్యాండ్‌, పెన్సిల్వేనియా, న్యూయార్క్‌ రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని వాషింగ్టన్‌ డీసీలో కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మంచు తుపాను బారినపడ్డ 12 రాష్ట్రాల పరిధిలని ప్రజలు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ మంచు తుపానుకు అమెరికా మీడియా స్నోజిల్లా అని పేరు పెట్టింది. అమెరికాను వణికించిన మంచు తుపాను స్నోజిల్లా చిత్రాలను అమెరికా వ్యోమగామి స్కాట్‌ కెల్లీ(51) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఫొటోలు తీశారు. 

No comments:

Post a Comment