Thursday, September 15, 2016

ఉత్తర కొరియా సైన్యాధిపతికి ఉరి

కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ (ఖూA) జనరల్‌ స్టాఫ్‌ చీఫ్‌ రి యోంగ్‌ గిల్‌ను ఉరి తీసినట్లు ఉత్తర కొరియా మీడియా  2016 ఫిబ్రవరి 10న వెల్లడించింది. రాజకీయ కుట్ర, అవినీతికి పాల్పడినందుకు ఆయనకు ఉరిశిక్ష విధించినట్లు యోన్‌ హాప్‌ వార్తా సంస్థ పేర్కొంది. 2013లో గిల్‌ ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నియంతృత్వ విధానాలతో తనకు అనుకూలించని వారిని అంతం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. జోంగ్‌ ఉన్‌ తన తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ మరణాంతరం 2011లో అధికారం చేపట్టారు. 2013లో తన మామ జాంగ్‌ సోంగ్‌ థాయెక్‌ను రాజకీయ కుట్ర, అవినీతి అభియోగాలపై ఉరి తీయించాడు. సైన్యంపై పూర్తి ఆధిపత్యం నిలుపుకోవడానికి ఉన్‌ అనేక మంది అధికారులను తొలగించడం లేదా అధికారం తగ్గించడం లాంటి చర్యలు తీసుకున్నాడు.

No comments:

Post a Comment