Wednesday, September 14, 2016

2015లో 54% పెరిగిన మరణశిక్షలసంఖ్య

ప్రపంచవ్యాప్తంగా 2015లో అమలైన మరణ శిక్షల సంఖ్య 54 శాతం మేర పెరిగినట్లు మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ 2015లో అమలైన మరణ శిక్షలకు సంబంధించి చైనా, ఇరాన్‌, పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, అమెరికా మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి. 2014లో 22 దేశాల్లో 1,061 మరణ శిక్షలు అమలు కాగా, 2015లో 61 దేశాల్లో 1998 మరణ శిక్షలు అమయ్యాయి. 2015లో పాకిస్థాన్‌ 326 మందిని ఉరితీయగా భారత్‌ ఒక్కరిని మాత్రమే ఉరితీసింది. 2015 జులై 30న నాగ్‌పూర్‌ కేంద్ర కారాగారంలో తీవ్రవాదం కేసులో యాకుబ్‌ యెమెన్‌ను భారత ప్రభుత్వం ఉరితీసింది.

No comments:

Post a Comment