Sunday, September 18, 2016

అవినీతి సూచీ-2015లో భారత్‌కు 76వ ర్యాంకు

జర్మనీకి చెందిన ‘ట్రాన్స్‌పెరెన్సీ ఇంటర్నేషనల్‌’ సంస్థ ప్రపంచ దేశాల అవినీతి సూచీ-2015ను విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల నుంచి సేకరించిన వివరాలతో ఈ నివేదికను రూపొందించారు. మొత్తం 168 దేశాలకు దీనిలో మార్కులను, ర్యాంకులను కేటాయించారు. భారతదేశానికి 38 మార్కులు, 76వ ర్యాంకు లభించాయి. థాయిలాండ్‌, బ్రెజిల్‌, ట్యునీషియా, జాంబియా, బుర్కినాఫోసో దేశాలు కూడా ఇదే ర్యాంకులను పొందాయి. మొదటి స్థానంలో నిలిచిన డెన్మార్క్‌కు 91 మార్కులు లభిం చాయి. అవినీతి సూచీ తయారీకి ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ కొన్ని ప్రమా ణాలను తీసు కుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న అవినీతి ఆధారంగా 1 (అత్యంత అవినీతి) నుంచి 100 (అవినీతి రహిత) కొలబద్ద పైన వివిధ దేశాలకు మార్కులనిచ్చారు. అదేవిధంగా ఇతర దేశాలతో పోల్చితే ఒక దేశం అవినీతి సూచీపై ఎక్కడుందో చెప్పడం కోసం ర్యాంకులను కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా 68 శాతం దేశాల్లో అవినీతి తీవ్ర సమస్యగా నెలకొని ఉందని, వీటిలో సగం అవినీతి జీ-20 దేశాల్లోనే ఉందని ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’ పేర్కొంది.

No comments:

Post a Comment