Sunday, September 18, 2016

అంతర్జాతీయ స్థాయి ఆవిష్కరణల్లో భారత్‌కు 54వ స్థానం

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఐటిఎఫ్ టి) అనే సంస్థ అంతర్జాతీయ స్థాయి ఆవిష్కరణల విషయంలో వివిధ దేశాల్లో విధానాలు ఎంత వరకూ ప్రోత్సాహకరంగా ఉన్నాయో అంచనా వేసింది. దీని కోసం ప్రపంచ ఆర్థిక రంగానికి 90% బాసటగా నిలుస్తున్న కీలకమైన 56 దేశాలను పరిశీలించగా వీటిలో మనదేశం 54వ స్థానంలో, అంటే కింది నుంచి మూడో స్థానంలో నిలిచినట్లు తేలింది. ఐటిఎఫ్ టి సంస్థ తొలిసారిగా ‘కాంట్రిబ్యూటర్స్‌ అండ్‌ డిట్రాక్టర్స్‌: ర్యాంకింగ్‌ కంట్రీస్‌’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక వివిధ దేశాల్లో కొత్త ఆవిష్కరణ కోసం విధానపరమైన మద్దతు, ప్రోత్సాహకం ఎక్కడ ఎక్కువగా లభిస్తోందన్నది అంచనా వేసింది. విధానపరంగా ఫిన్లాండ్‌, స్వీడన్‌, బ్రిటన్‌, సింగపూర్‌, నెదర్లాండ్స్‌ కొత్త ఆవిష్కరణ రంగానికి అత్యుత్తమ ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. ఉక్రెయిన్‌, థాయ్‌లాండ్‌, భారత్‌, ఇండోనేషియా, అర్జెంటీనా దేశాల్లో పరిస్థితి అథమంగా ఉందని నివేదిక వ్యాఖ్యానించింది. ఉన్నత స్థాయి విశ్వవిద్యాయాల విషయంలో మాత్రం భారత్‌ మధ్యస్థాయిలో ఉంది. ఈ విషయంలో మొత్తం 56 దేశాల్లో భారత్‌ 25వ స్థానంలో ఉంది.

No comments:

Post a Comment