Monday, September 19, 2016

2016 గ్లోబల్‌ రిటైల్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌లో భారత్‌కు 2వ స్థానం

కొత్త పెట్టుబడులకు, వ్యాపార నిర్వహణకు అత్యంత అనువైన దేశాల జాబితాలో అగ్రస్థానానికి భారత్‌ చేరువైంది. ప్రపంచవ్యాప్తంగా రిటైల్‌ పెట్టుబడులకు అనువుగా ఉన్న 30 వర్థమాన దేశాల జాబితాను 2016 గ్లోబల్‌ రిటైల్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌  ప్రచురించింది. 25 అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో అగ్రస్థానం చైనాది కాగా, రెండో స్థానంలో భారత్‌ నిలిచింది. గత ఏడాది కంటే భారత్‌ 13 స్థానాలు పైకి చేరడం గమనార్హం. జీడీపీ వృద్ధి, ఎఫ్‌డీఐలకు సంబంధించి స్పష్టత, పారదర్శకత వల్లే భారత్‌ రెండోస్థానానికి చేరగలిగిందని నివేదిక పేర్కొంది.

No comments:

Post a Comment