Monday, September 19, 2016

ఇన్నోవేషన్‌ సెంటర్స్‌ ఎక్కువగా గల నగరాల్లో బెంగళూరుకు 5వ స్థానం

  ప్రపంచవ్యాప్తంగా సృజనాత్మక కేంద్రాలు (ఇన్నోవేషన్‌ సెంటర్స్‌) ఎక్కువ సంఖ్యలో కలిగిన తొలి 5 నగరాల్లో భారత్‌ సిలికాన్‌ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగళూరుకు చోటు లభించింది. ఈ జాబితాలో అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ అగ్రస్థానాన్ని దక్కించుకోగా బెంగళూరు 5వ స్థానంలో నిలిచింది. ఈ నగరంలో కొత్తగా నాలుగు సృజనాత్మక కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అంతర్జాతీయ సాంకేతిక సంస్థ క్యాప్‌జెమినీ విడుదల చేసిన ‘డిజిటల్‌ డైనస్టీస్‌: ది రైజ్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ ఎంపైర్‌ వరల్డ్‌వైడ్‌’ నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.

No comments:

Post a Comment