Monday, September 19, 2016

అణు కార్యక్రమంతో భారత్‌`పాక్‌ మధ్య ఘర్షణ వాతావరణం

పాకిస్థాన్‌ అణు కార్యక్రమం భారత్‌తో సంబంధాలు మరింత దిగజారడానికి, ఘర్షణపూరిత వాతావరణాన్ని మరింత పెంచడానికి కారణమవుతోందని అమెరికా చట్టసభలకు (కాంగ్రెస్‌) చెందిన ఒక కమిటీ పేర్కొంది. పాకిస్థాన్‌ వద్ద 110-130 అణ్వాయుధాలు ఉండొచ్చని, అంతకంటే ఎక్కువ ఉండటానికి కూడా అవకాశం ఉందని పేర్కొంది. అణ్వాయుధాల భద్రతకు సంబంధించి పాకిస్థాన్‌ ఇటీవల పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఆ దేశంలో నెలకొన్న అస్థిరత కారణంగా ఈ చర్యలు ఎప్పటి వరకు కొనసాగగలవన్న సందేహాలను కమిటీ వ్యక్తం చేసింది. అణు సరఫరాదారుల బృందంలో సభ్యత్వం కోసం భారత్‌ చేస్తున్న కృషికి అమెరికా బలమైన మద్దతుదారుగా నిలిచింది. ఇప్పటికే తన సానుకూలత ప్రకటించిన అగ్ర రాజ్యం భారత్‌కు మద్దతు తెలపాలంటూ ఎన్‌ఎస్‌జీ సభ్య దేశాలకు పిలుపునిచ్చింది. ఎన్‌ఎస్‌జీలో మొత్తం 48 దేశాలున్నాయి. 

No comments:

Post a Comment