అద్దె గర్భాల(సరోగసీ) అక్రమాలను అరికట్టడానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. లాభాపేక్షతో కూడిన వాణిజ్య అద్దె గర్భాలను పూర్తిగా నిషేధించడం దీనిలోని ముఖ్య అంశంగా పేర్కొనవచ్చు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకుని 5 సం॥లు దాటిన భారతీయ దంపతులకు, అదీ కొన్ని పరిస్థితుల్లో మాత్రమే అద్దె గర్భం ద్వారా సంతానాన్ని కనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇటీవలి కాలంలో వాణిజ్యపర అద్దెగర్భాలకు మన దేశం కేంద్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అద్దె గర్భం (నియంత్రణ) బిల్లు, 2016 రూపొందించింది. దీని ప్రకారం అవివాహిత దంపతులను, ఒంటరి తల్లిదండ్రులను, సహజీవన భాగస్వాములను, స్వలింగ సంపర్కులను అద్దెగర్భం ద్వారా పిల్లలను కనడానికి అనుమతించారు. అద్దె గర్భంతో కన్నపిల్లలను వదిలేయడం, లాభాపేక్షతో అద్దెగర్భ విధానాన్ని ఎంచుకోవడం లాంటి ఉల్లంఘనకు పాల్పడితే 10 సం॥ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్ష జరిమానా విధిస్తారు. విదేశాల్లో ఉంటున్న భారతీయ పౌర కార్డున్న భారత సంతతి వ్యక్తుల, ప్రవాస భారతీయులతో పాటు విదేశీయులకూ అద్దెగర్భ నిషేధం వర్తిస్తుంది.
Friday, September 2, 2016
అద్దె గర్భం (నియంత్రణ)బిల్లు, 2016 కేబినెట్ ఆమోదం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment