అధునాతన జలాంతర్గామి స్కార్పీన్ రహస్య పత్రాలు లీక్ వ్యవహారంపై సమగ్ర విచారణకు కేంద్రం ఆదేశించింది. మరోవైపు ఫ్రాన్స్ కూడా దర్యాప్తు మొదలుపెట్టింది. స్కార్పీన్‌ను భారత్ కోసం ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్థ డీసీఎన్‌ఎస్ నిర్మిస్తోంది. ముంబయిలోని మజగావ్‌డాక్ నౌకా నిర్మాణ కేంద్రంలో భారత్ భాగస్వామ్యంలో ఆరింటిని అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.23,478 కోట్లు (3.5 బిలియన్ డార్లు) గా అంచనా. దీనికి సబంధించిన కీలక రహస్య వివరాలు వెలుగులోకి వచ్చాయంటూ ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక ఓ కథనం ప్రచురించింది. స్కార్పీన్ పోరాట సామర్థ్యానికి సంబంధించి 22,000లకు పైగా పత్రాలు బహిర్గతమైనట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ నావికాదళ అధిపతి అడ్మిరల్ సునీల్ లాంబాను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆదేశించారు.
Friday, September 2, 2016
స్కార్పీన్ రహస్య పత్రాలు లీకైనట్లు కథనం, విచారణ
అధునాతన జలాంతర్గామి స్కార్పీన్ రహస్య పత్రాలు లీక్ వ్యవహారంపై సమగ్ర విచారణకు కేంద్రం ఆదేశించింది. మరోవైపు ఫ్రాన్స్ కూడా దర్యాప్తు మొదలుపెట్టింది. స్కార్పీన్‌ను భారత్ కోసం ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్థ డీసీఎన్‌ఎస్ నిర్మిస్తోంది. ముంబయిలోని మజగావ్‌డాక్ నౌకా నిర్మాణ కేంద్రంలో భారత్ భాగస్వామ్యంలో ఆరింటిని అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.23,478 కోట్లు (3.5 బిలియన్ డార్లు) గా అంచనా. దీనికి సబంధించిన కీలక రహస్య వివరాలు వెలుగులోకి వచ్చాయంటూ ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక ఓ కథనం ప్రచురించింది. స్కార్పీన్ పోరాట సామర్థ్యానికి సంబంధించి 22,000లకు పైగా పత్రాలు బహిర్గతమైనట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ నావికాదళ అధిపతి అడ్మిరల్ సునీల్ లాంబాను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆదేశించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment