Saturday, September 17, 2016

ప్రపంచ సంపన్న దేశాలలో భారత్‌కు 7వ స్థానం

ప్రపంచంలోని 10 సంపన్న దేశాలలో ఒకటిగా భారత్‌ స్థానం సంపాదించింది. భారతీయుల వ్యక్తిగత సంపద విలువ 5.20 లక్షల కోట్ల డాలర్లు అని న్యూ వరల్డ్‌ హెల్త్‌ సంస్థ తెలిపింది. కానీ తలసరి ఆదాయం ఆధారంగా చూస్తే సగటు భారతీయుడు చాలా పేదవాడని పేర్కొంది. భారతదేశ జనాభా వంద కోట్లను దాటినందున వారి ఉమ్మడి సంపద విలువ 5 లక్షల కోట్ల డాలర్లను దాటిందని వివరించింది. న్యూ వరల్డ్‌ హెల్త్‌ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచ సంపన్న దేశాలలో భారత్‌ 7వ స్థానంలో ఉంది. 48.70 లక్షల కోట్ల డాలర్ల వ్యక్తిగత సంపదతో అమెరికా మొదటిస్థానంలో ఉంది. రెండో స్థానంలో చైనా ఉండగా, ఆ తరువాతి స్థానాల్లో జపాన్‌, జర్మనీ, బ్రిటన్‌ ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది.

No comments:

Post a Comment