రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి పట్టణాలపై జరిగిన అణ్వాయుధ దాడిలో మరణించిన 1,40,000 మందికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జపాన్‌లోని హిరోషిమా శాంతివనంలో 2016 మే 27న నివాళులర్పించారు. 1945 ఆగస్టు 6న హిరోషిమాపై బి-29 బాంబర్ నుంచి తొలి అణుబాంబు ‘లిటిల్ బాయ్’ను అమెరికా వదిలింది. ఆగస్టు 9న నాగసాకిపై బి-29 బాంబర్ నుంచి అణుబాంబు ‘ఫ్యాట్ బాయ్’ను అమెరికా వదిలింది. హిరోషిమాపై దాడితో 1,40,000 మంది, నాగసాకిపై దాడితో 70,000 మంది మరణించారు. హిరోషిమాను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామానే.
No comments:
Post a Comment