Wednesday, September 14, 2016

ఏనుగుల సంరక్షణపై కెన్యా విప్లవాత్మక నిర్ణయం

ఏనుగుల సంరక్షణపై నిబద్ధతను చాటుకుంటూ కెన్యా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఏనుగుల వేట, వాటి దంతాల అక్రమ రవాణాను పూర్తిగా నిషేధించాలని కోరుతూ ప్రపంచంలోనే భారీ స్థాయిలో వంద టన్నులకు పైగా ఏనుగు దంతాలకు నిప్పంటించింది. నాన్యుకీలో 2016 ఏప్రిల్‌లో జరిగిన ఆఫ్రికా దేశాల ఏనుగు సదస్సు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. నైరోబీ జాతీయ జంతు ప్రదర్శనశాలలో భారీ స్థాయిలో వృత్తాకారాల్లో పోగుచేసిన ఏనుగు దంతాలకు ఆ దేశాధ్యక్షుడు ఉహురు కెన్యట్టా నిప్పంటించారు.

No comments:

Post a Comment