Saturday, September 17, 2016

గ్రెటా జిమ్మర్‌ ఫ్రీడ్‌మన్‌ మృతి



ప్రపంచంలో అత్యంత విషాద ఘట్టమైన రెండో ప్రపంచ యుద్ధానికి 1945లో అత్యంత సుందరమైన ముగింపు నిచ్చిన న్యూయార్క్‌ టైమ్స్‌ కూడలి ముద్దు ఫొటోలో ఉన్న గ్రెటా జిమ్మర్‌ ఫ్రీడ్‌మన్‌ (92) న్యూయార్క్‌లో 2016 సెప్టెంబర్‌లో మరణించారు. ఆస్ట్రియాకు చెందిన ఫ్రీడ్‌మన్‌ యూదులపై హిట్లర్‌ ఊచకోత కారణంగా పదిహేనేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయి అమెరికా చేరుకున్నారు. దంత వైద్యుడి సహాయకురాలిగా పనిచేస్తూ నర్సు దుస్తుల్లో అనుకోకుండా టైమ్స్‌ కూడలికి వచ్చి ప్రపంచ ప్రసిద్ధ ఫొటోలో అజరామరం అయ్యారు. అప్పుడామె వయసు 21 ఏళ్లు. ఫొటోలో ఆమెకు ముద్దిచ్చిన నావికుడు జార్జి మెండోన్సా. 6 సం॥ల పాటు సుదీర్ఘంగా సాగిన రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన గడియల్లో చివరి వరకు పోరాడిన జపాన్‌ కూడా లొంగిపోయిన అనంతరం బాధిత దేశాల ప్రజలు 1945 ఆగస్టు 14న పట్టరాని ఆనందంతో వీధుల్లోకి వచ్చారు. వీజే డే (విక్టరీ ఓవర్‌ జపాన్‌) వేడుకలు చేసుకున్నారు. ఆ క్షణంలో న్యూయార్క్‌లోని చారిత్రక కూడలి టైమ్స్‌ స్క్వేర్‌లో పోగైన గుంపులో జార్జి మెండోన్సాకు చేరువలో ఉన్న ఫ్రీడ్‌మన్‌ను అమాంతం పొదవి పట్టుకొని అధరాల మీద చుంబించాడు. కొద్ది క్షణాల ఆ సంఘటనను అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్‌ ఆల్ఫ్రెడ్‌ ఐజన్‌స్టాట్‌ తన కెమెరాలో నిక్షిప్తం చేశాడు. ఆ ఫొటో అనంతరం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది.






No comments:

Post a Comment