Tuesday, September 13, 2016

మయన్మార్‌ అధ్యక్షుడిగా తిన్‌క్యా


మయన్మార్‌లో 50 ఏళ్ల సైనిక ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ మయన్మార్‌ మరో శకంలోకి అడుగుపెట్టింది. ఆంగ్‌సన్‌ సూకీ ‘ప్రజాస్వామ్య ఉద్యమం’ అధికార పగ్గాలు చేపట్టింది. సూకీకి విశ్వాసపాత్రుడు, బాల్య మిత్రుడైన తిన్‌క్యా 2016 మార్చి 30న నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఆంగ్‌సన్‌ సూకీ విదేశాంగ మంత్రిగా ప్రమా ణం చేశారు. 2015 నవంబ ర్‌లో జరిగిన ఎన్నికల్లో సూకీకి చెందిన నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ  మయన్మార్‌ ఉభయ సభల్లో ఘన విజయం సాధించింది. సూకీ భర్త మైఖేల్‌ బ్రిటిషర్‌ కావడం వల్ల ఆమెకు బ్రిటన్‌ పౌరసత్వం లభించింది.  అయితే సైనిక పాలకులు చేసిన రాజ్యాంగ నిబంధనల వల్ల అధ్యక్ష పదవిని చేపట్టడానికి సూకీకి అవకాశం లేకుండా పోయింది. ఈ నిబంధనను సవరించడానికి వారు నిరాకరించారు. దీంతో సూకీ అధ్యక్షురాలు కాలేకపోయింది. తిన్‌క్యా గతంలో అంగసాన్‌ సూకీ కారు డ్రైవర్‌గా పని చేశాడు.

No comments:

Post a Comment