Tuesday, September 13, 2016

సిరియా కొత్త ప్రధాని ఇమాద్‌ ఖమిస్‌

అంతర్యుద్ధాలతో సతమతమవుతున్న సిరియా దేశానికి కొత్త ప్రధానమంత్రి రాబోతున్నాడు. విద్యుత్‌శాఖ మంత్రి ఇమాద్‌ ఖామిస్‌ను ప్రధానిగా నియమిస్తున్నట్లు దేశాధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ తెలిపారు. కొద్ది రోజుల్లో నూతన మంత్రి వర్గం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతర్యుద్ధంతో ఇప్పటి వరకు 2,80,000 మంది దేశం నుంచి వలస వెళ్లారు. 2012 నుంచి వాయెల్‌ అల్‌ హల్కి సిరియా ప్రధానిగా ఉన్నారు. అసద్‌కు చెందిన బాత్‌ పార్టీ, మిత్రపక్షాలు సిరియా పార్లమెంటులో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న రెండు నెలల తర్వాత అక్కడ ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

No comments:

Post a Comment