Tuesday, September 13, 2016

స్విట్జర్లాండ్‌లో యుబీఐ పథకంపై ఓటింగ్‌

దేశంలోని ప్రజలంతా జీవించడానికి సరిపడా డబ్బును బేషరతుగా అందించాలన్న విప్లవాత్మక ప్రతిపాదనపై స్విట్జర్లాండ్‌లో ఓటింగ్‌ జరిగింది. ఇలాంటి ఆలోచన చేయడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి. దేశంలో కనీసం ఐదేళ్ల నుంచి చట్టబద్ధంగా నివసిస్తున్న విదేశీయులు సహా పౌరుందరికీ పని చేయకుండానే కనీస ఆదాయాన్ని అందించాలా అన్న ప్రశ్నను ఓటర్లకు సంధించారు. స్థిర ఆదాయాన్నిచ్చే ఉద్యోగాలు కనుమరుగవుతున్న వేళ యుబీఐ పథకం వల్ల పేదరికం, అసమానతపై పోరాడటానికి వీలవుతుందని దీని మద్దతుదారులు చెబుతున్నారు. అయితే దీని  వల్ల ధరకు రెక్కలు వస్తాయని, ప్రజలు సామూహికంగా ఉద్యోగాలు వదిలివేయడం చోటు చేసుకుంటాయని వ్యతిరేకులు చెబుతున్నారు.దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా ఏటా 250 కోట్ల ఫ్రాంక్‌ మేర భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని స్విస్‌ ప్రభుత్వంతోపాటు దాదాపుగా దేశంలోని పార్టీలన్నీ ఓటర్లకు పిలుపునిచ్చాయి. 78 శాతం మంది ఓటర్లు యుబీఐ పథకాన్ని తిరస్కరించినట్లు ప్రాథమిక ఫలితాలు వెల్లడించాయి.

No comments:

Post a Comment