Tuesday, September 13, 2016

డోనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం

 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. లాస్‌వేగాస్‌లోలోని ట్రెజర్‌ ఐలాండ్‌ క్యాసినోలోని మిస్టియర్‌ థియేటర్‌ వద్ద ట్రంప్‌ 2016 జూన్‌ 18న ఒక బహిరంగసభలో పాల్గొన్న సందర్భంగా ఆయనను హతమార్చేందుకు మైఖేల్‌ శాండ్‌ఫోర్డ్‌ అనే బ్రిటన్‌ యువకుడు ఒక పోలీసు అధికారి నుంచి తుపాకి లాక్కోవడానికి ప్రయత్నించాడు. వెంటనే భద్రతా అధికారులు అప్రమత్తమై ఆ యువకుడిని నిర్బంధించి అరెస్టు చేశారు. నెవడాలోని ఫెడరల్‌ న్యాయస్థానంలో మైఖేల్‌పై ఫిర్యాదు దాఖలయింది. ట్రంప్‌ను హతమార్చడానికే తాను కాలిఫోర్నియా నుంచి లాస్‌వేగాస్‌కు వచ్చానని మైఖేల్‌ శాండ్‌ఫోర్డ్‌.. సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ విచారణలో వెల్లడించినట్లు ఫిర్యాదులో పోలీసులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment