Tuesday, September 13, 2016

ప్రపంచంలో అత్యధిక సంపన్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌

  ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఆర్థిక వ్యవహారాలపై ‘సెంటర్‌ ఫర్‌ ది అనాసిస్‌ ఆఫ్‌ టెర్రరిజం’  నివేదిక విడుదల చేసింది. ఐఎస్‌ 2015లో సుమారు రూ.16 వేల కోట్లను ఆర్జించిందనీ, ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక సంపన్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ అని నివేదిక తెలిపింది. ఇరాక్‌, సిరియా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ నిధులను సమీకరించుకోవడానికి వింత వింత పన్నులు విధిస్తున్నది. అమెరికా, దాని మిత్రదేశాల దాడిలో భారీ నష్టాలను చవిచూస్తున్న ఐఎస్‌ ఇటీవల తన భూభాగాన్ని 22శాతం కోల్పోయింది. దీంతో తన పరిధిలోనున్న ప్రజలపై ఇష్టారాజ్యంగా పన్నులు విధిస్తున్నది. ఎవరైనా గడ్డం తీసుకొంటే 100 డాలర్లు, మహిళలు బిగుతైన దుస్తులు, సాక్స్‌ ధరిస్తే 25 డాలర్లు వసూలు చేస్తున్నది. తమ ప్రాంతంలోకి ఏదైనా ట్రక్కు రావాంటే ఇంతకుముందు 300 డాలర్లు చేయగా, ఇప్పుడు 600-700 డాలర్లు రాబడుతున్నది. సున్నీయేతరులపై జిజియా పన్నులు వసూలు చేస్తున్నది. ఇంతకుముందు ఏడాదికి ఒకసారి వసూలు చేయగా.. ఇప్పుడు నెల నెలా చెల్లించాని ఒత్తిడి తెస్తున్నది. 

No comments:

Post a Comment