సరికొత్త ఉగ్రవాద వ్యవస్థలకు పాకిస్తాన్, అస్థానిస్తాన్, మధ్యప్రాచ్య దేశాలు స్వర్గధామాలుగా రూపొందే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు ఒబామా హెచ్చరించారు. అమెరికా, అమెరికా మిత్రదేశాల రక్షణ కోసం ఇస్లామిక్ స్టేట్, ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థపై వేటను కొనసాగిస్తానని మరోసారి ప్రతిజ్ఞ చేశారు. 2017 జనవరిలో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పకోనున్న ఒబామా జనవరి 13న తన చివరి ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం చేశారు. ఉగ్రవాద సంస్థలైన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్), ఆల్‌ఖైదాపై అమెరికా విదేశాంగ విధానం ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా కాంగ్రెస్ ఉభయ సభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం ఇది ఎనిమిదోసారి.
No comments:
Post a Comment