ప్రపంచంలో అతిపెద్ద మానవరహిత నౌకను అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ ప్రపంచానికి పరిచయం చేసింది. 132 ఫీట్ల ఈ నౌక దానంతటదే 10 వేల నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదని పెంటగాన్ తెలిపింది. దీని పేరు ‘సీ హంటర్’. నీటి అడుగున దాక్కొనే శత్రువు జలాంతర్గామలు, మందుపాతరలను గుర్తించడం కోసం ‘సీ హంటర్’ను తయారు చేశారు. శాన్‌డియాగో తీరంలోని జలాల్లో రానున్న రెండేళ్లపాటు దీన్ని అమెరికా సైనిక పరిశోధన విభాగం ‘డార్పా’, నౌకాదళ నిపుణులు పరీక్షించనున్నారు. రాడార్, సోనార్, కెమెరాలు, జీపీఎస్ తదితర అత్యాధునిక టెక్నాలజీ సాయంతో సీ హంటర్ పనిచేస్తుంది.
No comments:
Post a Comment