Monday, September 19, 2016

భారత్‌, థాయిలాండ్‌ మధ్య ఒప్పందాలు

రక్షణ తీరప్రాంత భద్రతతోపాటు ఆర్థిక, సైబర్‌ సెక్యూరిటీ, మనుషుల అక్రమ రవాణా, ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు భారత్‌-థాయ్లాండ్‌ నిర్ణయించాయి. 2016 జూన్‌ 17న భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడి, థాయాలాండ్‌ ప్రధాన మంత్రి ప్రయుత్‌ చానోచా మధ్య ఢల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు. భారత్‌-మయన్మార్‌-థాయిలాండ్‌ త్రైపాక్షిక రహదారిని పూర్తి చేయటంతోపాటు ఈ మూడు దేశాల మధ్య మోటారు వాహన ఒప్పందం జరగటాన్ని భారత్‌, థాయిలాండ్‌ దేశాలు ప్రాధాన్యతాంశంగా గుర్తించాయి. ఇరుదేశాల మధ్య సంబంధాలకు త్వరలోనే 70 వసంతాలు పూర్తవనున్నందున భారత్‌లో థాయ్‌ ఉత్సవం, థాయిలాండ్‌లో భారత్‌ ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. 

No comments:

Post a Comment