Monday, September 19, 2016

ముంబయి దాడుల్లో పాక్‌ ప్రమేయంపై షాంఘై టీవీలో ప్రసారం

ముంబయిలో 2008 నవంబరు 26న జరిగిన ఉగ్రవాద దాడుల్లో పాకిస్థాన్‌ పాత్రను చైనా తొలిసారిగా అంగీకరించింది. ప్రపంచాన్ని కుదిపేసిన ఆ దాడుల్లో 164 మంది బలి కాగా, 308 మంది గాయపడ్డారు. ఈ మారణహోమంలో పాక్‌కు చెందిన ఉగ్రవాద ముఠా లష్కరే తోయిబా, దాని నాయకులు పోషించిన పాత్రను వివరిస్తూ చైనా ప్రభుత్వ టీవీ సీసీటీవీ ఒక షార్ట్‌ ఫిల్మ్‌ను ప్రసారం చేసింది. తమ ప్రభుత్వరంగ ఛానెళ్లలో ప్రసారమైన డాక్యుమెంటరీపై చైనా స్పందించింది. ఓ అమెరికా టీవీ కార్యక్రమానికి సదరు డాక్యుమెంటరీ డబ్బింగ్‌ మాత్రమేనని వెల్లడించింది. ముంబయిపై దాడులకు సంబంధించి తమ దేశ అభిప్రాయాలను అది ఎంత మాత్రం ప్రతిబింబించదని స్పష్టం చేసింది. 2016 మేలో మొదట షాంఘై టీవీలో ప్రసారమైన డాక్యుమెంటరీ తర్వాత చైనా సెంట్రల్‌ టెలివిజన్‌లోనూ ప్రసాంమైంది.

No comments:

Post a Comment