Monday, September 19, 2016

హైదరాబాద్‌ ఫండ్‌ కేసులో భారత్‌కు చుక్కెదురు

హైదరాబాద్‌ ఫండ్‌ కేసులో భారత్‌కు చుక్కెదురైంది. హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం కాకముందు పాకిస్థాన్‌కు తరలిపోయిన 35 మిలియన్‌ పౌండ్లు భారత్‌కే చెందుతాయని భారత్‌ వాదిస్తోంది. ఆ నిధులపై పాకిస్థాన్‌కు ఎలాంటి అధికారమూ లేదన్నది భారత్‌ వాదన. అయితే ఇంగ్లిష్‌ కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. పాకిస్థాన్‌కు అధికారం ఉందన్న దిశగా తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని ఈ కేసు విచారణ జరగాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి 75 పేజీల తీర్పును న్యాయమూర్తి హెండర్సన్‌ జె. వెలువరించారు. ‘ఆ నిధులపై పాకిస్థాన్‌కు హక్కు ఉందని నిరూపించే ఆధారాలు ఉన్నాయి. వాదనలు కూడా పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉన్నాయి. అవి లేవని, పాకిస్థాన్‌ ఎలాంటి ఆధారాలు లేకుండా హక్కు కోరుతోందని నిరూపించే వాదన కానీ, సాక్ష్యాలు కానీ భారత్‌ న్యాయస్థానం ముందు ఉంచలేకపోయింది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

No comments:

Post a Comment