Monday, September 19, 2016

‘గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూ’ అభ్యర్థనకు భారత్‌ తిరస్కరణ

భారత నగరాలు, పర్యాటక ప్రదేశాలు, నదులను ‘గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూ’ అప్లికేషన్‌లో పెట్టాలన్న గూగుల్‌ సంస్థ ప్రణాళికను భారత్‌ నిరాకరించింది. 2008లో ముంబయిలో జరిగిన ఉగ్రవాద దాడి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ‘గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూ’ కింద తాజ్‌మహల్‌, ఎర్రకోట, కుతుబ్‌మినార్‌, వారణాసిలో నది ఒడ్డు, నంద విశ్వవిద్యాలయం, మైసూర్‌ కోట, తంజావూర్‌ దేవాలయం, చిన్నస్వామి స్టేడియం తదితర పర్యాటక ప్రదేశాలకు మాత్రమే ప్రయోగ ప్రాతిపదికన అనుమతి లభించింది.

No comments:

Post a Comment