Monday, September 19, 2016

గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను పర్యవేక్షణకు న్యూఢల్లీ డిక్లరేషన్‌’

మానవ చర్యల కారణంగా ఉత్పన్నమవుతున్న గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను పర్యవేక్షించడానికి 60కి పైగా దేశాల అంతరిక్ష సంస్థలు తొలిసారిగా చేతులు కలిపాయి. అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఫ్రాన్స్‌ ఖగోళ సంస్థ సీఎన్‌ఈఎస్‌ చొరవ వల్ల ఇది సాధ్యమైంది. ఈ సంస్థలు ఉద్గార పర్యవేక్షణకు తమ ఉపగ్రహాలను ఉపయోగిస్తాయి. పరస్పరం సహకారం, సమన్వయంతో ముందుకు సాగుతాయి. ఇస్రో, సీఎన్‌ఈఎస్‌ ఆహ్వానం మేరకు 2016 ఏప్రిల్‌లో ఢల్లీ వచ్చిన ప్రపంచ అంతరిక్ష సంస్థలు తమ భూపరిశీన ఉపగ్రహా ల డేటాను కేంద్రీకృతం చేయడానికి ఒక స్వతంత్ర అంతర్జాతీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ చేసిన ‘న్యూఢల్లీ డిక్లరేషన్‌’ తాజాగా అమల్లోకి వచ్చింది.

No comments:

Post a Comment