మోటారు బైకుపై వెళుతూ హెల్మెట్ ధరించని కారణంగా కాంబోడియా ప్రధాని హన్‌సేన్‌కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. దీంతో తాను చేసిన పొరపాటుకు ప్రధాని బహిరంగంగా క్షమాపణ చెప్పారు. 2016 జూన్ 18న కోకాంగ్‌లో పర్యటించిన ఆయన అక్కడ రోడ్డుపక్కన ఉన్న మోటార్ టాక్సీ డ్రైవర్‌ను కలిశాడు. ఈ సందర్భంగా టాక్సీ డ్రైవర్‌ను వెనుక కూర్చొబెట్టుకొని సరదాగా 250 మీటర్లు హెల్మెట్ లేకుండా బైక్ నడిపారు. దీంతో అక్కడి ట్రాఫిక్ పోలీస్ అధికారి ప్రధానికి దాదాపు 15,000 కాంబోడియన్ రియాలు (దాదాపు రూ.250) జరిమానా విధించారు.
No comments:
Post a Comment