Tuesday, September 13, 2016

బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న హిందువుల జనాభా

ముస్లింలు ఎక్కువగా నివసించే బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా పెరుగుతోంది. బంగ్లాదేశ్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌(దీaఅస్త్రశ్రీaసవంష్ట్ర దీబతీవaబ శీట ూ్‌a్‌ఱర్‌ఱషం-దీదీూ) విడుదల చేసిన నివేదిక వివరాలను అక్కడి ప్రభుత్వం 2016 జూన్‌ 23న వెల్లడించింది. 2015వ సంవత్సరాంతానికి బంగ్లాదేశ్‌లోని మొత్తం జనాభాలో హిందువుల సంఖ్య 10.7 శాతమని పేర్కొంది. బంగ్లాదేశ్‌ జనాభా 15.89 కోట్లు కాగా అందులో హిందువుల సంఖ్య 1.7 కోట్లగా నివేదికలో తెలిపింది. 2014లో నిర్వహించిన లెక్కల్లో హిందువుల జనాభా 1.55 కోట్లు ఉంది. 2014 జనాభా లెక్కతో పోల్చి చూస్తే హిందువుల సంఖ్య 15 లక్షలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ లెక్కలు పూర్తిగా ర్యాండమ్‌ శ్యాంపిల్‌ ద్వారా లెక్కించినవని బీబీఎస్‌ పేర్కొంది.

No comments:

Post a Comment