ఆంధ్రప్రదేశ్ ప్రజల తలసరి ఆదాయం మరో 13 ఏళ్లలో రూ.5.07 లక్షలు సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దార్శనిక పత్రం (సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2029 డాక్యుమెంట్)ను ఆవిష్కరించింది. 2016 సెప్టెంబర్ 28న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పత్రాన్ని విడుదల చేశారు. గత ఆర్థిక సంవత్సరం రూ.5.2 లక్షల కోట్లున్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2029-30 నాటికి రూ.28.45 లక్షల కోట్లకు చేరుకుంటుందని, ఫలితంగా తలసరి ఆదాయం ప్రస్తుతం ఉన్న రూ.90,517 నుంచి రూ.5.07 లక్షలకు పెరుగుతుందని అంచనా వేసింది. వివిధ రంగాలకు లక్ష్యాలతోపాటు, కాలపరిమితినీ నిర్ధేశించింది.
ముఖ్యాంశాలు:
2019: అందరికీ జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు
2019: ప్రతి పంచాయతీలో ఒక మీసేవ కేంద్రం
2020: దేశానికి నైపుణ్య రాజధానిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం. 1.30 కోట్ల మందికి నైపుణ్యాలు నేర్పించడం.
2020: స్వయం సహాయక సంఘా సభ్యుల సంఖ్య 1.17 లక్షలకు పెంపు. వీరికి రూ.28 వేల కోట్ల రుణం కేటాయింపు.
2020: దేశంలోనే అత్యంత వ్యాపారానుకూలత రాష్ట్రంగా ఎదుగుదల.
2020: అందరికీ ఇళ్ల కల సాకారం. ఆకర్షణీయ నగరాలుగా మరో తొమ్మిది అభివృద్ధి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 40 లక్షల ఇళ్ల నిర్మాణం.

No comments:
Post a Comment