Sunday, October 9, 2016

అంతర్జాతీయ పోటీసూచీలో స్విట్జర్లాండ్‌కు అగ్రస్థానం

అంతర్జాతీయ పోటీసూచీ 2016-17ను ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించింది. వరుసగా ఎనిమిదోసారి స్విట్జర్లాండ్‌ ఈ సూచీలో అగ్రస్థానాన్ని పొందింది. 2వ స్థానంలో సింగపూర్‌, 3వ స్థానంలో అమెరికా నిలిచాయి. 2015లో 55వ స్థానంలో ఉన్న భారత్‌ రికార్డు స్థాయిలో 16 స్థానాలు మెరుగుపరచుకొని 39వ స్థానానికి చేరింది. భారతదేశంలో వ్యాపార నవీకరణ, వస్తువు మార్కెట్‌ సామర్థ్యం మెరుగుకావడంతో ర్యాంకింగ్‌ పైకెళ్లినట్లు డబ్ల్యూఈఎఫ్‌ వెల్లడించింది. బ్రిక్స్‌ దేశాల విషయానికొస్తే చైనా (మొత్తం మీద 28వ స్థానం) తొలి స్థానంలో ఉండగా, భారత్‌ రెండో స్థానాన్ని దక్కించుకుంది. సూచీలో భారత్‌కు 4.52 స్కోరు లభించగా, స్విట్జర్లాండ్‌కు 5.81గా నమోదైంది. నెదర్లాండ్స్‌, జర్మనీ, స్వీడన్‌, బ్రిటన్‌, జపాన్‌, హాంకాంగ్‌, ఫిన్‌లాండ్‌ తొలి 10 స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది మొత్తం 138 దేశాల్లో పోటీతత్వాన్ని పరిశీలించారు. మొత్తం 12 విభాగాల్లో దేశాల స్థానాలు నిర్ధారణ జరిగింది.

No comments:

Post a Comment