Thursday, October 6, 2016

లార్డ్‌ నరేంద్ర బాబూ భాయ్‌ పటేల్‌కు ఏషియన్‌ అఛీవర్స్‌ జీవితకాల సాఫల్య పురస్కారం


భారత సంతతికి చెందిన వైద్యుడు, బ్రిటన్‌ పార్లమెంటు సభ్యుడు అయిన లార్డ్‌ నరేంద్ర బాబూ భాయ్‌ పటేల్‌ (78) కు ప్రతిష్టాత్మక ఏషియన్‌ అఛీవర్స్‌ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. లండన్‌లో జరిగిన ఏషియన్‌ అఛీవర్స్‌ అవార్డు ప్రదానోత్సవంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఓ వైద్యుడిగా, ప్రజాప్రతినిధిగా ఎన్నో ఏళ్ల నుంచి పటేల్‌ బ్రిటన్‌ సమాజానికి అందించిన అపురూప సేవకు ఈ పురస్కారాన్ని అందించారు. బ్రిటన్‌లో వివిధ రంగాల్లో అద్భుతాలు సృష్టించిన భారతీయులకు ఏషియన్‌ బిజినెస్‌ పబ్లికేషన్స్‌ లిమిటెడ్‌ (ఏబీపీఎల్‌) ఏటా ఈ అవార్డును అందజేస్తోంది.

No comments:

Post a Comment