ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితా-2016లో వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ముకేష్ అంబానీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఈయన సంపద పెరిగి 2270 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.1.5 లక్ష కోట్లు) చేరింది. ఏడాది కిందట ఈ విలువ 1890 కోట్ల డాలర్లు. ఈసారి జాబితాలో చోటు దక్కడానికి కావాల్సిన కనీస సంపద 125 కోట్ల డాలర్లు. 2015లో ఈ విలువ 110 కోట్ల డాలర్లుగా ఉంది.
మొదటి పది స్థానాలు
1. ముకేష్ అంబానీ 2270 కోట్ల డాలర్లు
2. దిలీప్ సంఫ్వీు 1690 కోట్ల డాలర్లు
3. హిందుజా కుటుంబం 1520 కోట్ల డాలర్లు
4. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ 1500 కోట్ల డాలర్లు
5. పల్లోంజీ మిస్త్రీ 1390 కోట్ల డాలర్లు
6. క్ష్మీ మిట్టల్ 1320 కోట్ల డాలర్లు
7. గోద్రెజ్ కుటుంబం 1240 కోట్ల డాలర్లు
8. శివ్ నాడార్ 1140 కోట్ల డాలర్లు
9. కుమార మంగళం బిర్లా 880 కోట్ల డాలర్లు
10. సైరస్ ఫనావాలా 860 కోట్ల డాలర్లు
ఫోర్బ్స్ జాబితాలో నలుగురు మహిళలు:
1. సావిత్రి జిందాల్ (530 కోట్ల డాలర్లు-19 వ స్థానం)
2. హావెల్స్ కంపెనీని స్థాపించిన దివంగత క్విమత్ గుప్తా భార్య వినోద్ గుప్తా (250 కోట్ల డాలర్లు-46 వ స్థానం)
3. బయోకాన్ కంపెనీ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా (180 కోట్ల డాలర్లు-65వ స్థానం)
4. యూఎస్‌లీ ఫార్మా చైర్‌పర్సన్ లీనా తివారీ (163 కోట్ల డాలర్లు-79 వ స్థానం)
No comments:
Post a Comment