Sunday, October 9, 2016

పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజ

దేశంలో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉన్నట్లు తేలింది. పెట్టుబడుల వృద్ధి, భవిష్యత్‌ అంచనాలపై రిజర్వు బ్యాంకు అధ్యయనంలో దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌ ఎక్కువ వృద్ధి సాధించినట్లు తేలింది. 2015-16లో 15.8 శాతం పెట్టుబడితో రాష్ట్రం మొదటి స్థానంలో నిలువగా, 14.5 శాతంతో గుజరాత్‌ రెండో స్థానంలో, 10.9 శాతం పెట్టుబడులతో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచినట్లు ఆర్‌బీఐ అధ్యయనం వెల్లడించింది. 2014-15లో ఆంధ్రప్రదేశ్‌కు 8.1 శాతం పారిశ్రామిక పెట్టుబడులు రాగా, ఒక్క ఏడాదిలోనే పెట్టుబడులు 7.7 శాతం పెరిగినట్టు తెలిపింది. 2015లో దేశం మొత్తం మీద రూ.10 కోట్లుకు పైబడి పెట్టుబడులు పెట్టిన కంపెనీలు 706 ఉన్నాయని, అవి దేశం మొత్తం మీద రూ.1,38,700 కోట్ల పెట్టుబడులు పెట్టుగా ఆంధ్రప్రదేశ్‌కే రూ.21,914.6 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించింది. రాష్ట్ర స్థూ ఉత్పత్తి వృద్ధిరేటు (జీఎస్‌డీపీ)లో కూడా దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచిందని, 10.5 శాతం వృద్ధిరేటు సాధించిందని తెలిపింది. రాష్ట్రంలో తొలిసారి తలసరి ఆదాయం రూ.లక్షలకు పైగా నమోదైనట్లు పేర్కొంది. ఈ విషయంలో జాతీయ స్థాయిలో ఏపీ 9వ స్థానం నుంచి 7వ స్థానానికి చేరుకుందని, జీఎస్‌డీపీలో 8వ స్థానం నుంచి 7వ స్థానానికి వచ్చిందని ఆర్‌బీఐ అధ్యయనం వెల్లడించింది.

No comments:

Post a Comment