Wednesday, October 12, 2016

మహా వాగ్దానం.. ఇలా సాక్షాత్కారం



రెండున్నరేళ్ల క్రితం ఎన్నో ఆశలు, ఆశయాల మధ్య ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. పరిపాలనలో తనదైన ముద్రను వేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల వాగ్దానం అమలులో భాగంగా సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుని ఏడాది కాలంలోనే కార్యాచరణలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతమున్న 10 జిల్లాలను 31 జిల్లాలుగా పునర్వ్యస్థీకరించి అధికార విభజనకు పెద్దపీట వేశారు. జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలు కొత్తవి ఏర్పాటయ్యాయి. దసరా రోజు నుంచి ఇవన్నీ అమల్లోకి వస్తున్నాయి. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కీలక పరిణామాలివి..
2015 సెప్టెంబరు 28: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం వివిధ శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు.
2015 డిసెంబరు 3: ఏపీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏర్పాటు చట్టం -1974ను తెలంగాణ రాష్ట్రానికి అన్వయించుకుంటూ ఉత్తర్వులు.
2015 డిసెంబరు 3: ఏపీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నియమావళి 1984ని తెలంగాణ రాష్ట్రానికి అన్వయించుకుంటూ ఉత్తర్వులు.
2016 ఆగస్టు 10: ఉపముఖ్యమంత్రి మంత్రి మహమూద్‌అలీ నేతృత్వంలో కొత్త జిల్లాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు.
2016 ఆగస్టు 22: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రాథమిక ప్రకటన జారీ. ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఆహ్వానం.
2016 సెప్టెంబరు 21: సాయంత్రం 5 గంటలకు ముగిసిన అభ్యంతరాల స్వీకరణ గడువు. మొత్తం వచ్చిన అభ్యంతరాలు/ సూచనలు 1,00,607.
2016 అక్టోబరు 4: ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులననుసరించి ప్రాథమిక ప్రకటనకు అదనంగా నాలుగు జిల్లాల ఏర్పాటుపై ఎంపీ కె.కేశవరావు నేతృత్వంలో మంత్రుల కమిటీ.
2016 అక్టోబరు 7: నాలుగు జిల్లాలపై కేకే కమిటీ నివేదిక.
2016 అక్టోబరు 7: తెలంగాణలో కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేస్తూ మంత్రిమండలి తీర్మానం.
2016 అక్టోబరు 10: తెలంగాణలో కొత్తజిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు.
సోమవారం అర్ధరాత్రి 12.12 గంటలకు తుదిప్రకటన.
2016 అక్టోబరు 11: మంగళవారం.. విజయదశమి పర్వదినాన కొత్త జిల్లాల ప్రారంభం

No comments:

Post a Comment