Thursday, October 6, 2016

అంతర్జాతీయ రక్త మార్పిడి సంఘం సారథిగా రవిరెడ్డి


అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ రక్త మార్పిడి సంఘం (ఐఎస్‌బీటీ) సారథిగా భారత సంతతి వ్యక్తి రవిరెడ్డి
నియమితులయ్యారు. ఈ సంస్థకు సారథిగా ఆఫ్రికా ఖండానికి చెందిన వ్యక్తి నియమితులు కావడం ఇదే ప్రథమం. ప్రపంచవ్యాప్తంగా రక్తమార్పిడులు అత్యంత సురక్షితంగా జరిగేలా చర్యలు చేపట్టే ఈ సంస్థలో వైద్యరంగ నిపుణుల సభ్యుడిగా ఉన్నారు. ఐఎస్‌బీటీ ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ఉంది. 1935లో ఏర్పాటైన ఐఎస్‌బీటీలో 100 దేశాలకు పైగా సభ్యత్వం ఉంది. 

No comments:

Post a Comment