Saturday, October 8, 2016

శాన్‌ఫ్రాన్సిస్కోలో జుకర్‌బర్గ్‌ దంపతుల బయోహబ్‌


ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌, ఆయన భార్య ప్రిస్టిల్లా చాన్‌ తమ ఆస్తిలో 9 శాతం సంపదను దానధర్మాల కోసమే ఖర్చు చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే ఈ శతాబ్దం ముగిసే సరికి ఏ వ్యాధీ లేకుండా చేయాలన్న లక్ష్యంతో బయోహబ్‌ అనే పరిశోధన కేంద్రాన్ని స్థాపిస్తున్నట్లు అమెరికాలోని హోస్టన్‌లో ప్రకటించారు. దీని కోసం వచ్చే పదేళ్లలో దాదాపు రూ.21 వేల కోట్లు జుకర్‌బర్గ్‌ దంపతులు వెచ్చించనున్నారు. సుమారు రూ.4 వేల కోట్ల ఆరంభ వ్యయంతో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ బయోహబ్‌ ఏర్పాటవుతుంది. స్థానికంగా 3  విశ్వవిద్యాయాలు ఈ కేంద్రంలో భాగం కాబోతున్నాయి. కొత్త పరిశోధన సాధనాలు రూపొందించడం, వ్యాధుల నిర్మూలనలో శాస్త్రీయంగా ముందడుగు వేయడానికి ఈ కేంద్రం పనిచేస్తుంది.

No comments:

Post a Comment