Saturday, October 8, 2016

అత్యధిక సంపాదన గల టీవీ నటీమణుల జాబితాలో ప్రియాంక చోప్రా


 ప్రఖ్యాత ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ 2016 సంవత్సరానికిగాను ప్రకటించిన ప్రపంచంలో అత్యధిక సంపాదన ఉన్న టీవీ నటీమణుల జాబితాలో బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా స్థానం సంపాదించింది. 15 మంది ఉన్న ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచిన ప్రియాంక ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించింది. అమెరికా టీవీ షో క్వాంటికో ద్వారా గతేడాది అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టిన ప్రియాంక దాదాపు రూ.73.72 కోట్లు (11 మిలియన్‌ డార్లు) సంపాదించినట్లు ఫోర్బ్స్‌ వెల్లడించింది. అమెరికా నటి సోఫియా వెర్గారా రూ.288.16 కోట్ల (43 మి.డా.)తో వరుసగా ఐదోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. సూపర్‌ హిట్‌ టీవీ షో మోడరన్‌ ఫ్యామిలీలో వెర్గారా చేస్తోంది. కాలె కువాకో, మిన్డీ కాలింగ్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

No comments:

Post a Comment