లిబియా దేశంలో 14 నెలలుగా ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు ఎట్టకేలకు 2016 సెప్టెంబర్‌లో విడుదలయ్యారు. 2015 జులై 29 నుంచి కిడ్నాపర్ల చెరలో బందీలుగా ఉన్నవారిని రక్షించినట్లు భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు . లిబియాలోని సిర్ట్ విశ్వవిద్యాయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న తిరువీధుల గోపీకృష్ణ (ఏపీ), చిలువేరు బరాం కిషన్ (తెలంగాణ) 2015 జులై 29న ట్రిపోలి నుంచి స్వదేశానికి వచ్చేందుకు విమానాశ్రయానికి కారులో వెళుతుండగా అపహరణకు గురయ్యారు. అప్పటి నుంచి వీరి విడుదల కోసం కేంద్రం పలు విధాలుగా లిబియా ప్రభుత్వంతో చర్చలు జరిపింది. మిస్రెట పట్టణంలో ఉన్న ఆరుగురు బందీలను అమెరికా సైనిక బలగాలు సురక్షితంగా విడిపించాయి. అందులో వీరిద్దరితోపాటు లిబియా, కొరియాకు చెందిన మరో నలుగురు ఉన్నారు.
Saturday, October 8, 2016
ఉగ్రవాదులు చెర నుంచి తెలుగు ప్రొఫెసర్లు విడుదల

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment