దేశంలో మొదటిసారిగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలో అంతర్జాతీయ స్థాయి పాఠశాల (ఇంటర్నేషనల్ స్కూల్) ఏర్పాటు కానుంది. ఏపీలో ప్రపంచ స్థాయి సామాజిక మౌలిక వసతుల (సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) కల్పనలో భాగంగా విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతిలో ఒక్కోటి చొప్పున ఇలాంటి పాఠశాలల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి పోటీ నిర్వహించారు. విశాఖపట్నంలో ఏర్పాటుకు ప్రియదర్శిని, నోవా ఎడ్యుకేషనల్ సొసైటీ కన్సార్టియం ముందుకొచ్చింది. ఈ సంస్థ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
No comments:
Post a Comment