స్వచ్ఛభారత్ ఉద్యమాన్ని ఆరంభించి 2 సం॥లు పూర్తవుతున్న నేపథ్యంలో ఢల్లీలో 2016 సెప్టెంబర్ 30న ఇండోశాన్ సదస్సును నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడి ప్రారంభోపన్యాసం చేశారు. వలస పాలన విముక్తి కోసం గాంధీజీ సత్యాగ్రహాన్ని చేపట్టినట్టుగా స్వచ్ఛభారత్ కోసం స్వచ్ఛాగ్రహ ఉద్యమాన్ని చేపట్టాలని ప్రధాని మోడి సూచించారు. ఇండోశాన్ సదస్సు సందర్భంగా ప్రధాని, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు 2019 వరకు దేశాన్ని బహిరంగ మల విసర్జనరహితంగా మారుస్తామని హామీ ఇస్తున్న ప్రకటనపై సంతకాలు చేశారు. వీరిలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఉన్నారు. పట్టణ, గ్రామీణ సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు సైతం అలాంటి ప్రకటనలపై సంతకాలు చేశారు.
No comments:
Post a Comment