Tuesday, August 15, 2023

Bravery awards : 76 మందికి శౌర్య పురస్కారాలు

  •  విధి నిర్వహణలో అసమాన శౌర్యపరాక్రమాలు, ధైర్యసాహసాలు ప్రదర్శించిన త్రివిధ దళాల్లోని 76 మందికి పురస్కారాలు ఇచ్చేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. 
  • నలుగురికి (దిలీప్‌కుమార్‌ దాస్‌, రాజ్‌కుమార్‌ యాదవ్‌, బబ్లూ రభ, సంభా రాయ్‌లకు) మరణానంతరం కీర్తిచక్ర పురస్కారాలు లభించనున్నాయి. వీరంతా సీఆర్‌పీఎఫ్‌లో సేవలందించి అసువులు బాశారు. 
  • 11 మందికి శౌర్యచక్ర ప్రదానం చేస్తారు. వీరిలో ఐదుగురికి (మేజర్‌ వికాస్‌ భంభు, మేజర్‌ ముస్తఫా బొహరా, హవల్దార్‌ వివేక్‌ సింగ్‌ తోమర్‌, రైఫిల్‌మేన్‌ కుల్‌భూషణ్‌ మంత, మరొకరికి) మరణానంతరం వీటిని అందిస్తారు. 
  • స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా సైనిక దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందికి ఈ పురస్కారాలను ప్రకటించారు. 
  • 2022 అక్టోబరు 21న ఆర్మీ పైలట్‌- మేజర్‌ భంభు, కోపైలట్‌ మేజర్‌ బొహరా.. అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులకు రుద్రా హెలికాప్టర్‌లో వెళ్లి నిఘా సంబంధిత విధులు పూర్తిచేసుకుని తిరిగివస్తున్నప్పుడు అనూహ్యంగా ప్రమాదంలో పడ్డారు. వేగంగా కిందకి పడిపోయే పరిస్థితి వచ్చినా ఆ ఒత్తిడిని తట్టుకుంటూ హెలికాప్టర్‌ను నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నాలను వారు కొనసాగించారు. అది జనావాసాలపై, ఆయుధ గిడ్డంగిపై పడిపోకుండా అత్యంత ఒడుపుగా వ్యవహరించి, ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో వారు అమరులయ్యారు. సహచరుల ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలు బలిచ్చినందుకు వివేక్‌ సింగ్‌ తోమర్‌కు ఈ పురస్కారం ప్రకటించారు. సైన్యానికి సేవలందించిన మధు అనే జాగిలానికీ మరణానంతరం ప్రత్యేక ప్రస్తావనతో గుర్తింపు లభించనుంది.


76 bravery awards

  • President Draupadi Murmu approved awarding of awards to 76 people of the three forces who have displayed unparalleled bravery and courage in the line of duty.
  • Four people (Dilip Kumar Das, Rajkumar Yadav, Bablu Rabha and Sambha Roy) will be awarded Keerthichakra awards posthumously. All of them have served in CRPF and have done their best.
  • 11 people will be awarded Shaurya Chakra. Five of them (Major Vikas Bhambhu, Major Mustafa Bohara, Havaldar Vivek Singh Tomar, Rifleman Kulbhushan Mantha and another) will be awarded posthumously.
  • These awards were announced to the personnel of the armed forces and the Central Armed Police Forces on the occasion of Independence Day.
  • On October 21, 2022, Army pilot-Major Bhambhu and co-pilot Major Bohara met with an unexpected accident while returning to the borders of Arunachal Pradesh in a Rudra helicopter after completing surveillance duties. They continued their efforts to bring the helicopter under control, bearing the pressure despite the rapid descent. They were martyred trying to save people's lives by acting with utmost care so that it did not fall on the population and on the weapons depot. The award was announced to Vivek Singh Tomar for sacrificing his life to save the lives of his comrades. Madhu, a soldier who served the army, will also be recognized posthumously with a special mention.

No comments:

Post a Comment