Saturday, August 12, 2023

Tharosaurus indicus : థార్‌ ఎడారిలో పురాతన డైనోసార్‌

 


  • ఐఐటీ-రూర్కీ, భారత భూగర్భ సర్వే సంస్థ (జీఎస్‌ఐ) పరిశోధకులు రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని థార్‌ ఎడారిలో 16.7 కోట్ల ఏళ్ల క్రితం నాటి డైనోసార్‌ శిలాజాన్ని కనుగొన్నారు. 
  • డైక్రెయోసౌరిడ్‌ శాఖకు చెందిన ఈ జీవి పొడవైన మెడ కలిగిన శాకాహారి. 30 అడుగుల నుంచి 40 అడుగుల పొడవు, పొట్టి మెడ, తోక దీని ప్రత్యేక లక్షణాలు. 
  • ఇంతకుముందు చైనాలో కనుగొన్న డైక్రెయోసౌరిడ్‌ 16.6 కోట్ల నుంచి 16.4 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. దానికన్నా పురాతనమైన శిలాజం థార్‌ ఎడారిలో దొరికింది. దీనికి మన పరిశోధకులు ‘థారోసారస్‌ ఇండికస్‌’ అని నామకరణం చేశారు. 
  • భారత్‌లో ఇలా డైక్రెయోసౌరిడ్‌ సరీసృప శిలాజం లభ్యమవడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు మధ్య భారతంలో 19.9 కోట్ల నుంచి 18.3 కోట్ల ఏళ్ల క్రితం నాటి రెండు రకాల సరీసృప శిలాజాలు కనిపించాయి. అవి థారోసారస్‌ కన్నా పురాతనమైన సరీసృపాలైన బారపాసౌరస్‌, కోటా సౌరస్‌లు.

No comments:

Post a Comment