Monday, August 14, 2023

ఒకే కాలనీ ఒకే వినాయకుడు..సీసీ కెమెరాలతో శాంతిభద్రతలు ఓకే

హయత్‌నగర్‌ ఎస్సై నరసింహ 


ఎల్‌బీనగర్‌ (సక్సెస్‌ సీక్రెట్‌) : స్వాతంత్య్ర సమరయోధుల త్యాగఫలంతో సిద్ధించిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుని సమున్నతంగా ఎదగడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని హయత్‌నగర్‌ ఎస్సై నరసింహ అన్నారు. మంగళవారం  మన్సూరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని హయత్‌నగర్‌ షిర్డీసాయినగర్‌(వీరన్నగుట్ట)లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎస్సై నరసింహ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత స్వాతంత్య్ర సంగ్రామంతో పాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా నేడు మనం స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామన్నారు. ప్రతీ ఒక్కరు నైతిక విలువలతో జీవించడం అలవర్చుకుంటే ఎలాంటి దురాగతాలకు చోటు ఉండదన్నారు. గతంలో బంధాలు, అనుబంధాలు,  నైతిక విలువలకు అధిక ప్రాధాన్యం ఉండేదని, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడం కలచి వేస్తోందన్నారు. మనిషిని అతి స్వార్థం మూర్ఖుడిని చేస్తే, పరోపకారం మహానుభావుడిని చేస్తోందన్నారు. సోదర, సౌభ్రాతృత్వంతో కలసి మెలసి సంఘటితంగా ఉండాలని కాలనీవాసులకు ఎస్సై నరసింహ సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలన్నారు. వచ్చే వినాయక చవితి సందర్భంగా కాలనీలో ఒకే ఒక వినాయకుడిని ప్రతిష్టిస్తే అనవసర ఖర్చులు తగ్గుతాయని, ఆ డబ్బులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే కాలనీవాసులందరికీ ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. కాలనీవాసులంతా ఈ విషయంలో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటే సీసీ కెమెరాల ఏర్పాటుకు తాము కూడా సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు డాక్టర్‌ కంబాలపల్లి నరసింహయాదవ్‌, కేకేఎల్‌ గౌడ్‌, నాగార్జునపు సంతోష్‌కుమార్‌చారి, సత్తయ్య, వనం నరేష్‌, కంబాలపల్లి చిన్నాయాదవ్‌, శ్యామల ఎల్లస్వామి, సర్వేష్‌, మాతంగి రవి, తిరుపతిరెడ్డి, కందికంటి వెంకన్న, శ్యామల ధనమ్మ, కొణిదెన వెంకట్‌రావు, పాలెం శ్రీను, కాసుల గణేష్‌గౌడ్‌, చేరాల యుగంధర్‌చారి, మారోజు రామకృష్ణచారి, బౌరోజు నాగేందర్‌చారి, కాసుల బాలుగౌడ్‌, కడారి వెంకటేష్‌యాదవ్‌, సైదులు, గోపి, నాగేష్‌, యాదయ్యయాదవ్‌, పేటేటి రవి, కృష్ణమూర్తి, ఏడుకొండలు, కృష్ణ, శ్రీకాకుళం శ్రీనివాస్‌చారి, సారయ్య, వేణు, గిరి తదితరులు పాల్గొన్నారు. 












No comments:

Post a Comment