Tuesday, August 15, 2023

TSRTC : బస్సుల ట్రాకింగ్‌ కొరకు టీఎస్ ఆర్టీసీ ప్రారంభించిన యాప్‌ పేరు ఏమిటి?

 


  • బస్సు ఎక్కడుంది, ఎప్పుడొస్తుందో తెలిపే ‘గమ్యం’ యాప్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఎంజీబీఎస్‌ ప్రాంగణంలో 2023 ఆగస్టు 12న ప్రారంభించి.. లోగోను ఆవిష్కరించారు. 
  • ఈ యాప్‌ ద్వారా హైదరాబాద్‌లోని పుష్పక్‌, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు, జిల్లాల్లో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులనూ ట్రాక్‌ చేయొచ్చు. 
  • యాప్‌ ద్వారా ఆరంభ స్థానం నుంచి గమ్యస్థానం వరకు ఏయే బస్సులు ఏ సమయాల్లో ఏ స్టాపులో అందుబాటులో ఉంటాయో తెలుసుకోవచ్చు. డ్రైవర్‌, కండక్టర్‌ వివరాలూ ఉంటాయి.

మహిళల కోసం ‘ఫ్లాగ్‌ ఏ బస్‌’ ఫీచర్‌

  • గమ్యం యాప్‌లో ‘ఫ్లాగ్‌ ఏ బస్‌’ ఫీచర్‌ను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. రాత్రివేళల్లో బస్టాపులు లేని ప్రదేశాల్లో మహిళలకు ఇది ఉపయోగపడుతుంది. రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది. 
  • అందులో వివరాలు నమోదు చేయగానే స్మార్ట్‌ఫోన్‌ తెరపై ఆకుపచ్చ రంగు ప్రత్యక్షమవుతుంది. డ్రైవర్‌కు దీన్ని చూపిస్తే బస్సు ఆపుతారు. 
  • అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 100, అనారోగ్య సమస్యలుంటే 108, బస్సు బ్రేక్‌డౌన్‌ అయినప్పుడు ఆర్టీసీ హెల్ప్‌లైన్‌ను సంప్రదించేలా యాప్‌ను అనుసంధానం చేశారు. 
  • ఈ యాప్‌ను యాప్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లేస్టోర్లతోపాటు టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment